అద్దె ఇంట్లో ఉంటున్నారా? : 200 యూనిట్లు వరకు ఫ్రీ కరెంట్

అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే మీరు కరెంట్ బిల్లు పూర్తిగా కట్టక్కర్లేదు. 200 యూనిట్ల వరకు కరెంట్ వాడితే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు.

  • Publish Date - September 25, 2019 / 10:36 AM IST

అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే మీరు కరెంట్ బిల్లు పూర్తిగా కట్టక్కర్లేదు. 200 యూనిట్ల వరకు కరెంట్ వాడితే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్. దేశ రాజధానిలో అద్దెకు నివసించేవారికి రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం (సెప్టెంబర్ 25, 2019) ఊరట కలిగించే ప్రకటన చేశారు. అద్దెకు నివాసించే వారంతా తమ ఇంట్లో కరెంట్.. 200 యూనిట్ల వరకు వాడితే.. ఎలాంటి ఎలక్ట్రసిటీ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా పవర్ వాడుకోవచ్చునని చెప్పారు.

ఢిల్లీలోని అద్దెదారులు.. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే.. ముందుగా ప్రీపెయిడ్ మీటర్ జారీ కావాల్సి ఉందని అన్నారు. ప్రీపెయిడ్ మీటర్లను అద్దె ఇళ్లల్లో అమర్చడానికి అద్దె ఒప్పంద పత్రం (రెంట్ అగ్రిమెంట్) ఒకటి ఉంటే సరిపోతుందని కేజ్రీవాల్ చెప్పారు. ఇటీవల అద్దెదారులు తాము ఉండే గదికి ప్రీపెయిడ్ మీటర్ ఇన్ స్టాల్ చేయాలంటే.. ఆ ఇంటి యజమాని నుంచి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) పొందాల్సిన అవసరం ఉండేది.

‘ముఖ్యామాన్యరి కిరాయేదార్ బిజ్లి యోజన’ స్కీమ్ కింద అద్దె వాసులు ఎవరైతే రెండు వందల యూనిట్ల వరకు వాడితే వారికి ఎలాంటి ఛార్జ్ ఉండదని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘ఢిల్లీ వాసులకు అభినందనలు.. అద్దెదారులు కూడా ఉచిత విద్యుత్ పొందవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి అద్దె మీటర్ పథకం కింద ఇంటియజమాని, అద్దెదారులకు 24 గంటల విద్యుత్ తోపాటు చౌకైన విద్యుత్ అందుతుంది. ఢిల్లీలోని ప్రతి పౌరుడికి హక్కు ఉంది’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 

ఇకపై అలా చేయాల్సి పనిలేదన్నారు. నెలకు 200 యూనిట్ల వరకు పవర్ వాడుకునే ఢిల్లీ వాసులంతా ఎలాంటి ఎలక్ట్రసిటీ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ ఆగస్టు 1న ప్రకటించారు. ఒకవేళ వినియోగదారుడు ఎవరైనా నెలలో 201 యూనిట్లు వరకు కరెంట్ వాడితే ఫుల్ ఛార్జ్ చెల్లించాలని కేజ్రీవాల్ తెలిపారు.