Lockdown: దేశంలో మరోసారి లాక్‌డౌన్ అంటూ వార్తలు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అన్వయించుకుంటున్నారని స్పష్టం చేశారు.
- Naveen
- Published On : March 27, 2026 / 04:39 PM IST
Lockdown: ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత కారణంగా భారత దేశంలో మరోసారి కొవిడ్ తరహాలో లాక్ డౌన్ విధించవచ్చనే ఊహాగానాలపై కేంద్రం స్పందించింది. దేశంలో లాక్ డౌన్ తప్పదన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రం దగ్గర అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని తేల్చి చెప్పారు. అది పూర్తిగా అసత్య ప్రచారం అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని దేశ ప్రజలను కోరారు.
అంతేకాదు ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం చాలా ముఖ్యం అని హితవు పలికారు. గ్లోబల్ పరిస్థితులు మారుతున్నప్పటికీ ఇంధనం, నిత్యవసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. ప్రజల రాకపోకలపై కానీ, ఆర్థిక కార్యకలాపాలపై కానీ ఆంక్షలు విధించే ప్రణాళికలు లేవన్నారు. సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అన్వయించుకుంటున్నారని స్పష్టం చేశారు.
Also Read: కేంద్రం గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గింపు.. భారీగా తగ్గనున్న రేట్లు?
The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.
Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026
