×
Ad

Rajasthan : కచోరి తినాలనిపించి రైలు ఆపేసిన డ్రైవర్..తరువాత ఏమైందంటే..?!

కచోరి తినాలనిపించి రైలు ఆపేసాడు డ్రైవర్..సొంత కారు అనుకున్నాడోలేదా షేర్ ఆటో అనుకున్నాడేమో కచోరీ కోసం రైలు ఆపేసిన డ్రైవర్ పై అధికారులు సీరియస్ అయ్యారు.

  • Published On : February 24, 2022 / 02:16 PM IST

Loco Pilot Stops Train To Pick Up Kachoris

Loco pilot stops train to pick up kachoris : రైలు వేగంగా వెళుతోంది. చెట్లు పుట్టలు కనిపించి వెంటనే కనుమరుగు అయిపోతున్నాయి. అంతలోనే రైటు సడెన్ గా ఆగింది. ఎందుకు ఆగిందో ప్రయాణీకులకు అర్థం కాలేదు. కాసేపటికి అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.ఏంటీ ఇందుకు కూడా రైలు ఆపేస్తారా? ఇదేమన్నా షేర్ ఆటోనా? లేక సొంత కారా?లేదా ఆర్టీసీ బస్సా? అంటూగుస్సా అయిపోయారు. ఇంతకీ రైలును డ్రైవర్ (లోకోపైలెట్) ఎందుకు ఆపేసాడో తెలుసా? ‘కచోరీ’ కోసం. కచోరి తినాలనిపించి రైలు ఆపేశాడు ఆ రైలు డ్రైవర్. ఈ వింత ఘటన రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో జరిగింది.

Also read : Driver Stopped Train to Curd : ఆటో అనుకున్నాడేమో..పెరుగు కోసం రైలు ఆపేసిన డ్రైవర్..

రైలు వేగంగా వెళుతున్నప్పుడు కిటికీలో నుంచి బయటకు చూసినప్పుడు నచ్చిన ఆహార పదార్థం కనిపిస్తే కొనుక్కుని తింటాం.అదికూడా రైలు ఆగి ఉంటేనే.కానీ కారులాగా రైలును ఆపేసి కొనుక్కోగలేం. కానీ ఓ రైలును నడిపే లోకో పైలట్ మాత్రం అలా అనుకోలేదు.రైలునడిపేది ఆపేది నా చేతిలోనే ఉంది నా ఇష్టం వచ్చిన దగ్గర నేను ఆపుతాను అనుకున్నాడో ఏమోగానీ..ఓ చోట రైలు ఆపేసి తాపీగా కచోరీలు తెప్పించుకుని ఆ తరువాత తాపీగా రైలును ముందుకు పోనిచ్చాడు.ఒక వ్యక్తి తీసుకొచ్చిన కచోరి పార్సిల్ కవర్ ను తీసుకుని అంతే వేగంగా రైలును ముందుకు పోనిచ్చాడు సదరు లోకో పైలెట్..!!రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో జరిగిన ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది.

Also read : Petrol Prices: భారత్‌కి బ్యాడ్ న్యూస్, యుద్ధం దెబ్బకు భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లటంతో నార్త్ వెస్టర్న్ రైల్వే అధికారులు ఆ రైలును నడిపిన లోకో పైలట్, అదే రైలులోని అసిస్టెంట్ లోకోపైలట్, ఇద్దరు గేట్ మ్యాన్ లు, స్టేషన్ మేనేజర్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నార్త్ వెస్టర్న్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శశికిరణ్ మాట్లాడుతూ.. ‘‘మా దృష్టికి ఒక వీడియో వచ్చింది. అందులో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కు గేట్ మ్యాన్ ప్యాకెట్ అందిస్తున్నట్టు ఉంది. వెంటనే చర్యలు తీసుకున్నాం’’ అని ప్రకటించారు.