Driver Stopped Train to Curd : ఆటో అనుకున్నాడేమో..పెరుగు కోసం రైలు ఆపేసిన డ్రైవర్..

తన సొంత ఆటో అనుకున్నాడోఏమోగానీ ట్రైన్ డ్రైవర్ రైలు ఆపేసి వెళ్లి పెరుగు ప్యాకెట్ కొని తెచ్చుకున్నాడు. దీంతో ప్రయాణీకులు మండిపడ్డారు.

Driver Stopped Train to Curd : ఆటో అనుకున్నాడేమో..పెరుగు కోసం రైలు ఆపేసిన డ్రైవర్..

Driver Stopped Train To Curd

Driver stopped the train to buy curd : వెళుతు వెళుతు ఉన్న ట్రైన్ సడెన్ గా ఆగిపోయింది. ఎందుకు ఆగిందో ప్రయాణీకులకు కూడా తెలియదు. కానీ అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. దాంతో ప్రయాణీకులకు తిక్క రేగిపోయింది. ఏంటీ ట్రైన్ అనుకున్నవా? నీ ఆటో అనుకున్నావా? సడెన్ గా ఎక్కడ పడితే అక్కడ ఆపేయటానికి అంటూ డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. ఇంతకీ ఏమా ట్రైన్? ఎందుకు ఆగింది? కారణమేంటీ? అంటే..

లాహోర్-కరాచీ మధ్య ప్రతీరోజు డజన్ల సంఖ్యలో ఇంటర్ సిటీ ట్రైన్‌లు రాకపోకలు సాగిస్తుంటాయి. అలా ప్రతీరోజులాగానే గత సోమవారం (డిసెంబర్ 6,2021)కూడా లాహోర్ నుంచి కరాచీ వైపు వేలాది మంది ప్రయాణికులతో ఇంటర్ సిటీ ట్రైన్ బయల్దేరింది. సరిగ్గా కన్హా రైల్వే స్టేషన్‌కు సమీపానికి చేరుకోగానే ఆ ట్రైన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో తొలుత ప్రయాణికులు కంగారు పడ్డారు. ఆందోలన చెందారు. ట్రైన్‌లో టెక్నికల్ సమస్య ఏమో అనుకున్నారు.

Read more : Special Trains : శబరిమలకు ప్రత్యేక రైళ్లు

కానీ లోకో పైలట్, అతడి అసిస్టెంట్ ట్రైన్‌లో నుంచి దిగి.. చేసిన పనికి షాకయ్యారు. పెరుగు తెచ్చుకోవటం కోసం ట్రైన్‌ను ఆపేడని తెలిసి షాక్ అయ్యారు. డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. దీన్ని కొంతమంది వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ విషయం కాస్తా పాకిస్థాన రైల్వే మంత్రి దృషికి వెళ్లింది. రైల్వే మంత్రిగారు ఫైర్ అయ్యారు. సదరు లోకో పైలట్, అతడి అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Read more : Ashes fan Crazy propose : గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా అమ్మాయికి ఇంగ్లండ్ ఫ్యాన్ ప్రపోజ్..ముద్దులు హగ్గులు

సామాన్యుల అతి పెద్ద ప్రయాణసాధనం రైలు. రోజు లక్షలాదిమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎన్నో పనులమీద ఎక్కడనుంచి ఎక్కడెక్కడికో వెళుతుంటారు. అలా ప్రయాణించేటప్పుడు సడెన్ గా ట్రైన్ ఆగిపోయిందనుకోండీ..ఏంటీ ట్రైన్ ఆగింది? కారణమేంటో తెలుసుకోవాలనిపిస్తుంది.పైగా ఎక్కువ సేపు ఆగి ఉంటే విసుగువచ్చేస్తుంది. చిరాకు వచ్చేస్తుంది. రైలులో నుంచి ఒక్కొక్కరు కిందకు దిగేసి అసలు ఎందుకు ఆగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఆగిందో తెలియకపోయినా కొంతమంది ఏవేవో ఊహించేసుకునే ఏవేవో కారణాలు చెప్పేస్తుంటారు. అసలు కారణం మాత్రం వారికి కూడా తెలియదు. అలాగే ఆ ట్రైన్ డ్రైవర్ కేవలం పెరుగు కోసం ట్రైన్ ఆపి వెళ్లటంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తంచేసారు.