Ashes fan Crazy propose : గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా అమ్మాయికి ఇంగ్లండ్ ఫ్యాన్ ప్రపోజ్..ముద్దులు హగ్గులు

గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా అమ్మాయికి ఇంగ్లండ్ ఫ్యాన్ ప్రపోజ్ చేశాడు. స్టేడియంలో ని జనాలు ప్రేమికుల్ని ప్రోత్సహించటం.. ముద్దులు హగ్గులతో స్టేడియం అంతా హోరెత్తిపోయింది.

Ashes fan Crazy propose : గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా అమ్మాయికి ఇంగ్లండ్ ఫ్యాన్ ప్రపోజ్..ముద్దులు హగ్గులు

Ashes Asks Fan Proposes To Girlfriend During First

Updated On : December 10, 2021 / 3:06 PM IST

Ashes fan proposes to girlfriend during at Gabba : లవ్ ప్రపోజల్‌ ఎన్ని రకాలుగా చేసినా మోకాళ్లమీద కూర్చుని ఓ ఎర్రిటి గులాబీ పువ్వు ఇచ్చి చేసేది మాత్రం ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. నీ ప్రేమ నేను కోరుకుంటున్నాను..నీ ప్రేమను పొందటానికి ఏమైనా చేస్తాను. నా హృదయం పీఠం నీకే నా ప్రియతమా..అని చెప్పే ఆ యాంగిల్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. లవ్ ప్రపోజ్ చేయటం ఎవరి స్టైల్ వారిది. ఎవరు ఎలా ప్రపోజ్ చేసినా ఆ ప్రేమ జంట హ్యాపీగా ఉండటం..వారి జీవితాల్లో ఆ ప్రపోజ్ చేసిన విధానం ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇలా లవ్ ప్రపోజల్ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటారు. అలా గత కొంతకాలంగా క్రీడా స్టేడియంల్లో లవ్ ప్రపోజల్ సర్వసాధారణంగా మారింది. అటువంటిదే మరోటి గబ్బా స్టేడియంలో జరిగింది. ఓ ఆస్ట్రేలియా అమ్మాయికి ఇంగ్లండ్ ఫ్యాన్ ప్రపోజ్ చేయటం..ఆమె ఆశ్చర్యపోయి..తరువాత ఓకే చెప్పటంతో వారిద్దరు అంతమంది ముందు హగ్గులు..ముద్దులతో చెలరేగిపోవటంతో స్టేడియంలో జనాలంతా ప్రోత్సహించటంతో అద్దరిల్లిపోయింది.

Read more : Crazy lover : పానీపూరీలో ఉంగరం పెట్టి..లవ్ ప్రపోజ్..
గత కొంతకాలంగా క్రీడా ప్రేమికులు తమ అభిమాన జట్టు ఆటను స్టేడియంలో కూర్చుని చూస్తు.. ప్రపోజ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగింది. ఇది కాస్త డిఫరెంట్అనే చెప్పాలి. ప్రత్యర్థి జట్ల అభిమానులైన ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం..స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్స్ వారిని ప్రోత్సహించడం..ప్రేమికులు ముద్దులు, హగ్గులతో చెలరేగిపోవటంతో స్టేడియం అంతా దద్దరిల్లిపోయింది. దీనికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Read more : World Oldest Cake : 80 ఏళ్లనాటి చాక్లెట్ కేకు..ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే..!!

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజైన నేడు ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. అతను ప్రపోజ్ చేసిన తరువాత ఆమ అతడి వంక ఆశ్చర్యంగా చూసింది. వెంటనే తేరుకుని ఓకే చెప్పేసింది. ఎక్కవ టైమ్ తీసుకోకుండానే. ఆ వెంటనే ఇక ముద్దులు, కౌగిలింతలో స్టేడియం హోరెత్తిపోయింది. మ్యాచ్‌ను వీడియో తీస్తున్న కెమెరాలు అన్నీ ఆ ప్రేమికుల వైపే ఫోకస్ చేశాయి. స్టాండ్స్‌లోని అభిమానులు కూడా ప్రేమికుల్ని మరింత ఉత్సాహపరిచారు. కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.

మైఖేల్ అనే యువకుడు మోకాళ్లపై కూర్చుని టోరీ అనే యువతిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె క్షణకాలం పాటు నమ్మలేకపోయింది. ఆ వెంటనే తేరుకుని ఓకే చెప్పడంతో అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న ఉంగారాన్ని ఆమె చేతికి తొడిగాడు. వారి చుట్టూ ఉన్న అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహ పరచడంతో స్టాండ్స్ కేరింతలతో దద్దరిల్లింది.