Nirmala Sitharaman: ఇక ఆ చట్టాలు చెల్లవు.. నూతన బ్యాంకింగ్ బిల్లుకు ఆమోదం.. లోక్‌సభ కీలక నిర్ణయం

నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ప్రవేశపెట్టిన ఈ చట్టం ఆర్థిక లావాదేవీలకు సరైన చట్టబద్ధత కల్పిస్తూ, న్యాయపరమైన సాక్ష్యాల సమర్పణ ప్రక్రియను సులభతరం చేయనుంది.

lok sabha passes bankers books evidence bill 2026 digital records legal validity

  • పాత బ్యాంకింగ్ చట్టాల రద్దు
  • డిజిటల్ సాక్ష్యాలకు పూర్తి చట్టబద్ధత
  • బ్యాంక్ అధికారులకు పెను ఉపశమనం

Nirmala Sitharaman: దేశీయ ఆర్థిక, బ్యాంకింగ్ రంగాన్ని నవ యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన చట్టసభల సంస్కరణకు శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ పాలన కాలం నాటి 135 ఏళ్ల నాటి ప్రాచీన ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ – 1891’ స్థానంలో ఆధునిక సాంకేతిక పరిణామాలను ప్రతిబింబించే ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు – 2026’ను లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన ఈ నూతన చట్టం, నేటి డిజిటల్ యుగంలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలకు సరైన చట్టబద్ధత కల్పిస్తూ, న్యాయపరమైన సాక్ష్యాల సమర్పణ ప్రక్రియను ఎంతో సులభతరం చేయనుంది.

Steel Bridge: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్.. అందుబాటులోకి మరో స్టీల్ బ్రిడ్జి.. ఏ రూట్ లోనో తెలుసా?

డిజిటల్ రికార్డులు, సంతకాలకు చట్టబద్ధత:

పాత చట్టం కేవలం భౌతిక కాగితపు లెడ్జర్లు, చేతిరాత రికార్డులకే పరిమితం కాగా, నూతన చట్టం యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ డేటా, క్లౌడ్ స్టోరేజ్, డిజాస్టర్ రికవరీ సర్వర్లలోని రికార్డులన్నింటినీ కోర్టుల్లో ప్రాథమిక సాక్ష్యాలుగా గుర్తించేలా మార్పులు తెచ్చింది. అంతేకాకుండా ‘ఐటీ చట్టం-2000’ కింద ధ్రువీకరించిన డిజిటల్, ఎలక్ట్రానిక్ సంతకాలకు సంపూర్ణ చట్టబద్ధత కల్పించారు. దీనివల్ల ఆర్థిక నేరాలు, చెక్ బౌన్స్, రుణ రికవరీ కేసుల్లో విచారణ మరింత వేగవంతం కానుంది.

బ్యాంకింగ్ సిబ్బందిపై తగ్గిన పనిభారం:

ఈ నూతన చట్టం ద్వారా బ్యాంకింగ్ అధికారులకు ప్రత్యక్ష కోర్టు హాజరు నుంచి గణనీయమైన ఉపశమనం లభించింది. బ్యాంకులు నేరుగా భాగస్వాములు కాని కేసుల్లో కోర్టు ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తే తప్ప అధికారులు భౌతిక రికార్డులతో హాజరుకావాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల బ్యాంక్ ఉద్యోగులపై అనవసర ఒత్తిడి తగ్గడమే కాకుండా, సర్టిఫైడ్ డిజిటల్ ఆధారాల ద్వారా న్యాయ విచారణ త్వరితగతిన పూర్తవుతుంది.