Lord Krishna idol-Eidgah row: కృష్ణుని విగ్రహ ప్రతిష్టాపనకు హై సెక్యూరిటీ.. బాబ్రీ ఘటన జరిగిన రోజే

అఖిల్ భారత్ హిందూ మహాసభ మధురలోని షహీ ఈద్గాలో జలాభిషేకం నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా కృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయాలని నిర్ణయించింది. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసం..

Lord Krishna idol-Eidgah row: అఖిల్ భారత్ హిందూ మహాసభ మధురలోని షహీ ఈద్గాలో జలాభిషేకం నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా కృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయాలని నిర్ణయించింది. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసం చేసిన రోజు డిసెంబర్ 6వ తేదీయే కావడంతో పోలీసులు సెక్యూరిటీ పెంచారు.

ఈ మేరకు అఖిల్ భారత్ హిందూ మహాసభ, శ్రీకృష్ణ జన్మభూమి నిర్మాణ్ న్యాస్, నారాయణి సేన, శ్రీకృష్ణ ముక్తి దళ్ లు ముందుగానే ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదంటూ పర్మిషన్ తీసుకున్నారు. షహీ ఈద్గాహ్ లో పుట్టాడని చెప్పుకుంటున్న స్థలంలోనే కృష్ణ విగ్రహం ప్రతిష్టించుకుంటామని అఖిల్ భారత్ హిందూ మహాసభ అనుమతి కోరింది.

సిటీ 4సూపర్ జోన్లు, 4జోన్లు, 8సెక్టార్లుగా విభజించారు. డిసెంబర్ 6తో పాటు రెండో రోజు కూడా ఎటువంటి వాహనాలను ఆ రోడ్ లోకి అనుమతించరు. 2వేల మంది కంటే ఎక్కువ పారామిలటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈవెంట్ డిస్టర్బ్ చేయాలని చూసే వాళ్లపై కన్నేసి ఉంచాయి.

…………………………………………………. : విశాఖ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి

ముందస్తు జాగ్రత్తగా శనివారమే దీనికి సంబంధించి మాక్ డ్రిల్ పూర్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు