Madhya Pradesh: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపన అనంతరం మహిళలకు అన్ని రంగాల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇక ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో ఈ డిమాండ్ మరింత పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అయితే దీన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీన్ని సానుకూలంగా మలుచుకుని ఎన్నికల్లో విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సంచన ప్రకటన చేసి ఎన్నికల ప్రచారాన్ని మరో మలుపుకు తిప్పారు.
మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (మహిళా నియామకాల ప్రత్యేక చట్టం) నిబంధన 1997కు సవరణ చేసి 35 రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంది. వాస్తవానికి ఇంతకు ముందే పోలీస్ నియామకాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇక టీచర్ నియామకాల్లో అయితే ఏకంగా 50 శాతం ఇస్తామని చెప్పారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే బాలిక విద్యకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని సీఎం శివరాజ్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
World first Prison : 800 మంది కరడుకట్టిన ఖైదీల వల్ల మూతపడిన ప్రపంచంలోనే మొట్టమొదటి జైలు
Noida airport: ఫాస్ట్ ఫాస్ట్‌గా నోయిడా ఎయిర్పోర్ట్ నిర్మాణం.. ప్రారంభం ఎప్పుడో తెలుసా?