తాను కరోనాతో బాధపడుతున్నా పనులు ఆగవంటోన్న సీఎం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివాజ్ సింగ్ చౌహన్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎంపీ సీఎం తనతో క్లోజ్ కాంటాక్ట్ అయిన వారిని కొవిడ్ టెస్టులు చేయించాల్సిందిగా కోరారు. తనతో పాటుగా తిరిగిన వ్యక్తులను క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచించారు.

మంత్రి లక్షణాలు బయటపడటంతోనే అందరినీ అలర్ట్ చేశారని.. రిజల్ట్ పాజిటివ్ గా వచ్చిందని తెలిపాు. నాకు కొవిడ్-19 లక్షణాలు కనిపించాయి. టెస్టు చేయించుకోగా రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. నాతో పాటుగా తిరిగిన సహచరులందరినీ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా కోరాను అని చౌహన్ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో కొవిడ్ టెస్టు చేయించుకుని సకాలంలోనే పాజిటివ్ అని తేలితే.. త్వరగా రికవర్ అవ్వొచ్చు. మార్చి 25నుంచి ప్రతి రోజు సాయంత్రం నా స్టేటస్ చెబుతూనే ఉన్నాను. ప్రస్తుత పరిస్థితిని వీలైనంత త్వరగా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నా.

సీఎం చౌహన్ లేని సమయంలో హోం మంత్రి నారోట్టం మిశ్రా కరోనా వైరస్ పరిస్థితితో పాటు ఇతర వ్యవహరాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. అర్బన్ డెవలప్ మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్ భూపేంద్ర సింగ్, మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్ట్ విశ్వాస్ సాంగ్, హెల్త్ మినిస్ట్ ప్రభురామ్ చౌదరి సీఎం గైర్హాజరీలో అధికార బాధ్యతలు చూసుకుంటారు.