Madhya Pradesh Farmer : ఇదేం పోయే కాలం రా నాయనా.. బాబాగా మారాలని.. గొడ్డలితో ప్రైవేట్ పార్ట్ నరుక్కున్న వ్యక్తి
Madhya Pradesh Farmer : బాబాగా మారాలనే నిర్ణయం తీసుకున్న ఓ రైతు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
- Dharani Pilli
- Updated on- May 31, 2026 / 10:56 AM IST
Madhya Pradesh Farmer chops off his genitals with an axe to become a godman
- మధ్యప్రదేశ్ లో దారుణం
- బాబాగా మారాలని రైతు దారుణ నిర్ణయం
- ప్రైవేట్ పార్ట్ నరుక్కున్న వ్యక్తి
Madhya Pradesh Farmer : కొందరు జనాల తీరు చూస్తే అసలు వాళ్లకి బుర్ర, బుద్ధి ఉందా లేదా అనే ఆలోచన రాకమానదు. అంత ఆలోచన లేకుండా అలా ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. బాబాగా మారాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి.. దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. గొడ్డలితో తన ప్రైవేట్ పార్ట్‌ను నరుక్కున్నాడు. పాపభీతి నుంచి విముక్తి పొందడం కోసం ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..
ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాలో వెలుగుచూసింది. బాబాగా మారాలని భావించిన ఒక రైతు (42) గొడ్డలితో తన జననాంగం నరుక్కుని బావిలో విసిరేశాడు. ఈ సంఘటన మహారాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ బాధ్యతల నుంచి బయటకు వచ్చి.. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి.. పాపభీతి నుంచి విముక్తి పొందాలని భావించిన బాధితుడు.. బాబాగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శరీరంలోని జననాంగమే మనిషిలోని కోరికలకి ప్రధాన కారణమని.. పాపం చేయడానికి ప్రేరేపించే ఈ అవయవం తన శరీరంలో ఉండకూడదని భావించి.. ఆ నిర్దిష్ట భాగాన్ని తొలగించాలని అనుకున్నాడు.
*రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ఈ క్రమంలోనే పొలంలోని బావి వద్దకు వెళ్లిన బాధితుడు.. ఈ దారుణ చర్యకు పూనుకున్నాడు. గొడ్డలితో ప్రైవేట్ భాగాన్ని నరుక్కుని దాన్ని బావిలోకి పడేశాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. పొలం దగ్గరకు వచ్చి చూసేసరికి రక్తస్రావంతో పడి ఉన్న అతడిని గమనించారు. వెంటనే ఆయన్ను ఛతర్‌పుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు.
*21కేసులు.. 14ఏండ్లుగా పరారీ.. మోస్ట్ వాంటెండ్ రౌడీ షీటర్‌ను పట్టించిన గ్యాస్ కనెక్షన్..
బాధితుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తెకు వచ్చే నెల, అనగా జూన్ 25న వివాహం జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాధితుడి భార్య గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. భార్య అనారోగ్యం, కుటుంబంలో ఆర్థిక సమస్యల వల్ల బాధితుడు గత కొద్దిరోజులుగా తీవ్రమైన మానసిక వేదనతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇలాంటి ఓ దారుణ నిర్ణయం తీసుకున్నాడని భావిస్తున్నారు. బాధితుడు చేసిన పని వల్ల రక్తస్రావం తీవ్రంగా జరిగిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తున్నట్లు డాక్టర్ వెల్లడించారు.
