అక్కచెల్లెళ్లను ఒకేసారి..ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని గుడవాలి గ్రామంలో జరిగింది. ఈ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుడవాలి గ్రామానికి చెందిన దిలీప్ (35) వినీత (28)లకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరిద్దరికీ ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. వినీత గుడవాలి గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తోంది.
పనుల్లో బిజీగా ఉంటున్న వినీతకు పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవటం కష్టమైపోతోంది. దీంతో దిలీప్ భార్యతో నేను మరో పెళ్లి చేసుకుంటే ఆమె ఇంటినీ నన్నూ..పిల్లల్ని చూసుకుంటుంది నువ్వు గ్రామం పనులు చూసుకోవచ్చు అని సలహా చెప్పాడు. భర్త మరో పెళ్లికి వినీత అంగీకరించింది. దీంతో బైట సంబంధం ఎందుకు అనుకుని వినీత చెల్లెలు రచన(22)ను దిలీప్ పరిహార్ నవంబర్ 26న పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..ఇదే వేదికపై మొదటి భార్య వినీతకు పరిహార్ మరోసారి తాళి కట్టి.. దండలు మార్చుకున్నారు.
ఈ పెళ్లిపై దిలీప్ పరిహార్ మాట్లాడుతూ..తన మొదటి భార్య వినీత అంగీకారంతోనే ఆమె చెల్లెలు రచనను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. వినీతకు ఆరోగ్యం కూడా సరిగాలేదనీ..దీంతో గ్రామం బాధ్యత..ఇటు ఇల్లు పిల్లల బాధ్యత చూసుకోవటానికి ఎవ్వరూ లేదనీ దీంతో.. వినీత చెల్లిని పెళ్లి చేసుకున్నాను అని పరిహార్ చెప్పాడు. ఈ పెళ్లి ఏదో సినిమా స్టోరీలా ఉన్న వీరి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.