ఇళ్లు ఇవ్వలేదని ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ

  • Publish Date - October 4, 2019 / 06:36 AM IST

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ప్రభుత్వం కేటాయించే ఇళ్లను అక్రమంగా కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టింది మహిళ. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లను తప్పుగా కేటాయించారని ఆరోపిస్తూ ఒక మహిళ ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టింది. ఈ విషయం నుంచి తేరుకునే లోపే మరికొంతమంది మహిళలు వచ్చి ఇళ్ళు తప్పుగా కేటాయించారంటూ ప్రభుత్వ అధికారులను కొట్టారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయిస్తూ ఉండగా కొంతమంది అర్హత లేనివాళ్లకు ఇళ్లను కేటాయించి అసలైన అర్హులకు మాత్రం కేటాయించట్లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహిళలు ఆందోళన చేయగా.. అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహిళ చెప్పు తీసుకుని అధికారిని కొట్టింది. 

తప్పుగా కేటాయించిన ఇళ్లను తొలిగించి అర్హులైనవాళ్లకు ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కేంద్ర హౌసింగ్ పథకం కింద 54 లక్షల ఇళ్ళు నిర్మాణానికి పునాధులు పడగా.. 90 లక్షలకు పైగా ఇళ్ళు మంజూరయ్యాయి. 2020 నాటికి అందరికీ ఇళ్లు అందించాలనేది ఈ పథకం ఉద్ధేశ్యం.