Madras High Court: ఇస్లాంలోకి మారితే బీసీ హోదా రద్దు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
హిందూమతంలోని వెనుకబడిన, షెడ్యూల్డ్ కులాల వారు ఇస్లాంలోకి మారితే వారిని 'వెనుకబడిన తరగతి ముస్లిం'లుగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు(Madras High Court) స్పష్టం చేసింది.
- V Santhosh Kumar
- Published on- June 27, 2026 / 09:04 AM IST
Madras High Court delivered landmark verdict stating that BC status does not apply upon conversion to Islam.
- మతమార్పిడి ముస్లింలకు రిజర్వేషన్ లేదు.
- తమిళనాడు ప్రభుత్వ జీవో నిలిపివేత.
- ఇస్లాం ప్రధాన సూత్రం సమానత్వం.
Madras High Court: హిందూమతంలోని వెనుకబడిన, షెడ్యూల్డ్ కులాల వారు ఇస్లాంలోకి మారితే వారిని ‘వెనుకబడిన తరగతి ముస్లిం (BCM)’లుగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు(Madras High Court) స్పష్టం చేసింది. వారిని కేవలం ముస్లింలుగానే గుర్తించడం జరుగుతుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు 2024 మార్చి 9న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవో (GO) అమలును జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ పీబీ బాలాజీలతో కూడిన ధర్మాసనం నిలిపివేసింది. ఇస్లాంలోకి మారిన వ్యక్తి ఏదో ఒక ముస్లిం కులానికి చెందినవాడిగా మారలేడని, కేవలం ఒక ముస్లింగా మాత్రమే ఉంటాడని కోర్టు స్పష్టం చేసింది.
Rythu Bharosa Applications: రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ‘రైతు భరోసా’ దరఖాస్తులు.. ఇవి తప్పనిసరి
ప్రభుత్వ వాదన తిరస్కరణ:
తూత్తుకుడి జిల్లాకు చెందిన పరమశివం అనే వ్యక్తి 2015లో ఇస్లాంలోకి మారి సమీర్ అహ్మద్‌గా పేరు మార్చుకున్నారు. ప్రభుత్వ జీవో ఆధారంగా తనను ‘ముస్లిం లబ్బే’ వర్గంగా గుర్తిస్తూ బీసీఎం కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోగా, ఆయన నిరాకరించారు. దీనిపై సమీర్ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ కమిషన్ సిఫారసుల మేరకే జీవో తెచ్చామని, మతమార్పిడికి ముందు రిజర్వేషన్ పొందినవారు తర్వాత కూడా పొందవచ్చని వాదించింది. అయితే, ఈ వాదనను ధర్మాసనం పూర్తిగా తోసిపుచ్చింది.
ఇస్లాం సూత్రం సమానత్వం.. జీవో రాజ్యాంగ విరుద్ధం:
ఒక హిందువు ముస్లింగా మారినప్పుడు ఆయన పూర్వ కులంతో సంబంధం ఉండదని 1951 నాటి తీర్పులను కోర్టు గుర్తుచేసింది. ఇస్లాంలో కుల వ్యవస్థ, సామాజిక శ్రేణి వ్యవస్థ ఉండవని, దాని ప్రధాన దైవసూత్రం సమానత్వమని బెంచ్ పేర్కొంది. ఇస్లాం, క్రైస్తవ మతాలు సామాజిక సమానత్వాన్ని అందిస్తాయని ప్రచారం చేసుకుంటూ, మళ్లీ వాటిలో శ్రేణి వ్యవస్థ ఉందనడం సరికాదని వ్యాఖ్యానించింది. కొన్ని వర్గాలను వెనుకబడినవిగా, మరికొన్నింటిని అభివృద్ధి చెందినవిగా వర్గీకరించడం ఖురాన్ ఆదేశాలకు, రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పునిచ్చింది.
