Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్ కి షాక్.. అఫిడవిట్లలో రూ.100 కోట్ల తేడా.. హైకోర్టు నోటీసులు

తమిళగ వెట్రి కళగం అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌(Cm Vijay)కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

madras high court notice to tvk chief actor vijay regarding election affidavits.

  • నటుడు విజయ్‌కు హైకోర్టు నోటీసులు.
  • ఆస్తుల అఫిడవిట్లలో భారీ అవకతవకలు.
  • వంద కోట్ల తేడాపై పిటిషన్.

Cm Vijay: తమిళగ వెట్రి కళగం అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌(Cm Vijay)కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తుల వివరాలకు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ విజయ్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, ఆదాయపన్ను శాఖలకు కూడా హైకోర్టు నోటీసులు పంపింది.

Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం.. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి

ఈ పిటిషన్‌ను వి. విఘ్నేశ్ అనే వ్యక్తి దాఖలు చేశారు. విజయ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలో పరస్పర విరుద్ధమైన, తప్పుడు విషయాలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తిరుచ్చి తూర్పు నియోజకవర్గ అఫిడవిట్‌లో విజయ్ తన చరాస్తుల విలువను రూ.224 కోట్లుగా చూపించగా, పెరంబూర్ నియోజకవర్గ అఫిడవిట్‌లో మాత్రం కేవలం రూ.105 కోట్లుగా పేర్కొన్నారని పిటిషనర్ ఆధారాలతో సహా వివరించారు. రెండు అఫిడవిట్ల మధ్య ఏకంగా రూ.100 కోట్లకు పైగా వ్యత్యాసం ఉండటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒకే అభ్యర్థి వేర్వేరు నియోజకవర్గాల్లో సమర్పించిన పత్రాలలో ఇంత పెద్ద మొత్తంలో తేడాలు ఉండటం ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచడమేనని పిటిషనర్ ఆరోపించారు. ఓటర్లకు అభ్యర్థుల నిజమైన ఆర్థిక వివరాలను తెలుసుకునే హక్కు ఉందని, ఈ వ్యత్యాసాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన మద్రాస్ హైకోర్టు, దీనిపై స్పందించాలంటూ తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత వర్గాలన్నింటికీ నోటీసులు జారీ చేసింది.