ఘాటెక్కిన మల్లెపూలు: కిలో రూ.3 వేలు..!!

  • Publish Date - December 3, 2019 / 06:01 AM IST

మల్లెపూలు కిలో ఎంత ఉంటాయి. మహా ఉంటే వెయ్యి రూపాయలు ఉండొచ్చు. పెళ్లిళ్ల సీజన్ లో అయితే ఇంకా ఎక్కువైతే కిలో రూ. 15 వందలు ఉటుంది. కానీ మధురైలో కిలో మల్లెపూలు రూ.3వేలు అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాలు  విస్తృతంగా కురవడంతో మల్లె పువ్వుల ధర కొండెక్కింది. కిలో రూ.3వేలకు చేరుకుంది.వారం రోజుల క్రితం కిలో  1500-1800 రూపాయలు అమ్మిన మల్లె పూల ధరలకు రెక్కలు వచ్చాయి. 

దీనిపై సర్వన్న కుమార్  అనే మల్లె పూల వ్యాపారి మాట్లాడుతూ..వర్షాలు భారీగా కురుస్తుంటంతో మల్లె పూల దిగుబడి తగ్గిపోయిందనీ దీంతో పూల ధర రూ. ఒక్కసారిగా పెరిగిపోయి కిలో రూ.3వేలకు పెరిగిందని తెలిపారు.