గణేష్ నిమజ్జనంలో అంబులెన్స్ దారి : ఎలా ఇచ్చారో చూడండీ

  • Publish Date - September 13, 2019 / 06:52 AM IST

వినాయక నిమజ్జం కోలాహంలో..వేడుకల్లో మునిగిపోయిన  భక్తులు పెద్ద మనస్సుని చాటుకున్నారు. భారీగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకల్లో సమన్వయాన్ని పాటించారు. పూనెలోని లక్ష్మి రోడ్ లో భారీగా వినాజయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ వేడుకల్లో  భక్తులు ఇసుకవేస్తే రాలనంతగా హాజరయ్యారు. ఈ దారి వెంట ఓ అంబులెన్స్ వచ్చింది. దీంతో  భక్తులంతా ఎవరికి వారు స్పందించారు. గురువారం (సెప్టెంబర్ 12)న జరిగిన ఈ వేడుకల్లో భక్తులు అంబులెన్స్‌కు దారిచ్చారు.  ఈ వీడియో  అందరి ప్రశంసలు పొందుతోంది.  భక్తులు చేసిన ఈ మంచిపనికి నెటిజన్లు అభినందిస్తున్నారు. 

భారీగా శోభాయాత్రం జరుగుతున్న సమయంలో మేళతాళాలతో..డప్పుల మోతలు..గణపతి పప్పా మోరియా అంటూ భక్తుల నినాదాలమధ్య అంబులెన్స్ కుయ్ కుయ్ మంటూ మోగించే సైరన్ విన్న కొంతమంది భక్తులు దీన్ని విన్నారు. వారు వారి ముందున్న వారిని అప్రమత్తం చేశారు. అంబులెన్స్ కు దారివ్వమని బిగ్గరగా అరస్తూ..దాని ముందు అరుచుకుంటూ పరిగెట్టారు. దీంతో భక్తులంతా వెంటనే స్పందించి అంబులెన్స్ కు దారివ్వగా..భారీగా బారులు తీరి వున్న భక్తుల మధ్య నుంచి అంబులెన్స్ సులభంగా వెళ్లగలిగింది.