త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలు రూపొందిస్తున్నాయి. శివసేన
త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలు రూపొందిస్తున్నాయి. శివసేన తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకునే పథకాలతో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. అన్ని వర్గాల వారిపై వరాలు కురిపించింది. ముఖ్యంగా అన్నదాతలకు పెద్దపీట వేసింది. వారికి ప్రత్యేక సాయం ప్రకటించింది. శివసేన అధికారంలోకి వస్తే రూపాయికే వైద్య పరీక్షలు, 10రూపాయలకే భోజనం, రూ.10వేలు ఆర్థిక సాయం చేస్తామంది.
పేదలకు అందుబాటులో వైద్యం, ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు, రాష్ట్రవ్యాప్తంగా 1000 భోజనాలయాలు.. వాటిలో రూ.10కే నాణ్యమైన భోజనం, గృహాలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ వాడకంపై 30 శాతం రాయితీ, మరాఠీలో 80శాతం పైగా మార్కులు తెచ్చుకున్న 10, ప్లస్ టూ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, రైతులకు ఏటా రూ.10 వేలు నగదు బదిలీ, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం కాలేజీల వరకు ప్రత్యేక బస్సులు… శివసేన మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు. అంతేకాదు రైతులకు ఊరట కలిగించేలా ఐదేళ్లపాటు ఎరువులు, పురుగు మందుల ధరల్లో ఎలాంటి మార్పులు చేయబోమని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న ధరలనే వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేడి తార స్థాయికి చేరింది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలు తీసుకొస్తున్నాయి. శివసేన కూడా ఎక్కడా తగ్గలేదు. మరి శివసేన హామీలు, పథకాలు.. ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటాయో, గెలిపిస్తాయో చూడాలి. శివసేన, బీజేపీ, ఆర్పీఐ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
అక్టోబర్ 7న కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. పంట రుణమాఫీ, మోటార్ వెహికల్ యాక్ట్ జరిమానాల తగ్గింపు, ఉన్న విద్యకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. అక్టోబర్ 21న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 24న ఫలితాలు వెల్లడిస్తారు.