Maharashtra Migrants: లాక్‌డౌన్ మొదలైంది.. వలసదారుల తిప్పలు షురూ

కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా వారంతపు లాక్ డౌన్లతో పాటు నైట్ కర్ఫ్యూలను సైతం విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం..

Maharashtra Migrants: కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా వారంతపు లాక్ డౌన్లతో పాటు నైట్ కర్ఫ్యూలను సైతం విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. లాక్‌డౌన్ విధించగానే వలస కార్మికుల బాధలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో లాగే ట్రాన్స్ పోర్ట్ కూడా ఆగిపోతుందేమోనని.. పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తారేమోననే భయంతో సొంతూళ్లకు బయల్దేరిపోయారు.

ముంబై నగరమంతా లోకల్ రైల్వే స్టేషన్ల, బస్ స్టేషన్లలో వలసదారులంతా గుమిగూడారు. సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమవుతుండటంతో మహారాష్ట్ర కార్మిక శాఖ మంత్రి హసన్ మష్రిఫ్ రాష్ట్రం వదిలి వెళ్లొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నిలిపివేసే ప్లాన్లు లేవనే హామీ ఇస్తున్నారు.

వచ్చే నెలల్లో ఆదాయం ఉండదేమోనని వెళ్లిపోతున్నారు. ఒక్కసారిగా వలస కార్మికులంతా తిరుగు బాట పడుతుండటంతో నార్త్ ఇండియన్ రైల్వే భోగీలు కిక్కిరిసిపోయాయి. మూడు ప్రత్యేక రైళ్లు పురమాయించి రాకపోకలు నిర్వహిస్తున్నారు. ముంబై నుంచి మాత్రమే కాకుండా భీవండీ, థానె, పూణె వారు సైతం ఇంటి దారి పట్టారు.

అధికారులు ప్రయాణం చేసే సమయంలో కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు. గతంలో లాక్ డౌన్ తర్వాత కుటుంబాలను వదిలేసి నగరానికి వచ్చిన వాళ్లు ఎటువంటి లగేజీలు లేకుండా పయనమవుతున్నారు. గుజరాత్ లోనూ పలువురు వలస కార్మికులు, ఉత్తరప్రదేశ్, బీహార్ లలో బస్ స్టాండ్లలో కిక్కిరిసిపోయారు.

ట్రెండింగ్ వార్తలు