Golden Modak : గణపతికి ఇష్టమైన బంగారు మోదక్.. ధర తెలిస్తే షాక్
గణపతికి ఇష్టమైన పిండివంటకం మోదక్.. నాసిక్ కి లోకి ఓ స్వీట్ షాప్ బంగారు మోదక్ లను తయారు చేసి అమ్ముతోంది. వీటి ధర చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
- kunduru Vinod
- Updated on- September 20, 2021 / 06:57 PM IST
Golden Modak
Golden Modak : గణపతి నవరాత్రలు ఆదివారంతో ముగిశాయి. ఇక కొన్ని చోట్ల ఈ రోజు కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే నవరాత్రుల్లో గణపతికి ఇష్టమైన వంటకాలు చేసిపెడుతుంటారు భక్తులు. గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళలతోపాటు మోదక్ లను నైవేద్యంగా పెడుతుంటారు. గణపతికి మోదక్ ప్రసాదం అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు. నవరాత్రుల రోజుల్లో ప్రతి ఇంట్లో వీటిని చేస్తుంటారు. మోదక్ లను బియ్యం పిండితో అప్పులు చేసి అందులో పూర్ణం లేదా కొబ్బరి లేదంటే రవ్వ వేసి ఎవరికి నచ్చిన విధంగా వారు చేస్తుంటారు.
Read More : SBI Warning : ఆ నెంబర్లతో జాగ్రత్త.. ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక
అయితే నవరాత్రుల సమయంలో మనకు స్వీటు షాపుల్లో కూడా లభిస్తాయి. కేజీ 2 నుంచి 3 వందల మధ్య ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఫొటోలో చూస్తున్న ఈ మోదక్ మాత్రం కేజీ రూ.12,000. ఎందుకు వీటికి అంత ధర అంటే.. అవి బంగారు పూతతో చేశారు. అందుకే.. ఆ స్వీట్ షాప్‌లో కిలో మోదక్‌లను 12 వేల రూపాయలకు అమ్ముతున్నారు.
Read More : Stock Markets: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఓ స్వీట్ షాప్‌లోనే ఈ మోదక్‌లు దొరికేది. కేవలం గోల్డెన్ మోదక్లే కాదు.. సిల్వర్ మోదక్.. ఇంకా 25 రకాల వెరైటీలతో చేసిన మోదక్‌లు వాళ్లు దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ఈ గోల్డెన్ మోదక్‌లు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అంతరేటు ఉన్నా.. కొనేందుకు వెనకాడటం లేదు ప్రజలు.
