Stock Markets: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి.

10TV Telugu News

Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి. గతవారం లాభాలతో ముగియగా.. ముదుపరులు ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపైనా పడడంలో నష్టాల్లోకి వెళ్లిపోయాయి మార్కెట్లు. గతవారం సూచీలు భారీ లాభాలు చూడగా.. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం కూడా మరో కారణమని చెబుతున్నారు నిపుణులు.

ఈ క్రమంలోనే లోహ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఫలితంగా సూచీలు నష్టాలలోకి వెళ్లిపోగా.. ఆఖరికి సెన్సెక్స్ 524.96 పాయింట్లు (0.89%) క్షీణించి 58,490.93 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 188.30 పాయింట్లు (1.07%) నష్టపోయి 17,396.90 వద్ద ముగిసింది. నేడు సుమారు 995షేర్లు లాభాల్లోకి రాగా.. 2308 షేర్లు నష్టాలు చవిచూశాయి. 132 షేర్ల విలువ మాత్రం మారలేదు. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.63 వద్ద ముగిసింది.

టాటా స్టీల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, యుపీఎల్, ఎస్‌బీఐ షేర్లు నిఫ్టీలో భారీగా నష్టపోతే.. హెచ్‌యుఎల్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ టాప్ గెయినర్లలో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ మినహా ఇతర అన్ని రంగాల సూచీలు దాదాపు 2 శాతం నష్టపోయినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

10TV Telugu News