SBI Warning : ఆ నంబర్లతో జాగ్రత్త.. ఖాతాదారులకు SBI హెచ్చరిక

సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో. డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్న

10TV Telugu News

SBI Warning : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో. డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లతో బ్యాంకు వినియోగదారులను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. వారి జేబులు గుల్ల చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐని సైతం నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ల బెడద వెంటాడుతోంది. దీంతో ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. తన బ్యాంకు కస్టమర్లను సైబర్ క్రిమినల్స్ నుంచి కాపాడేందుకు ఎప్పటికప్పుడు ఎస్‌బీఐ అప్రమత్తం చేస్తోంది. తగిన సూచనలు జారీ చేస్తోంది. తాజాగా మరోసారి అలర్ట్ చేసింది.

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను ఎస్బీఐ హెచ్చరించింది. బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఖాతాదారులు ఓసారి అధికారిక వెబ్ సైట్ లో కస్టమర్ కేర్ నెంబర్లను సరిచూసుకోవాలని సూచించింది. లేదంటే పెద్ద మొ్తంలో డబ్బులు పొగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Car Fire Accident : డాక్టర్ ప్రాణం తీసిన ఎలుకలు..

”నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ల పట్ల జాగ్రత్త వహించాలి. సరైన కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. బ్యాంక్ ఖాతాకు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు కానీ చేసినప్పుడు కానీ బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని.. అకౌంట్ డబ్బు తస్కరిస్తారు. మరీ ముఖ్యంగా పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ఖాతా నెంబర్, డెబిట్ కార్డు, ఓటీపీ వివరాలు ఎవరితోనూ షేర్ చేయొద్దు. సరైన్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ చూడాలి” అని ఖాతాదారులకు ఎస్బీఐ సూచించింది.