ఆల్ హ్యాపీ : రైల్వేస్టేషన్‌లోనే ప్రసవం

  • Publish Date - April 27, 2019 / 06:49 AM IST

థానే రైల్వే స్టేషన్ లో అరుదైన సంఘటన. ఓ గర్భిణికి ప్రాణం పోశారు. మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్ లో శనివారం (ఏప్రిల్ 27, 2019) ఉదయం ఈ ఘటన జరిగింది. పుట్టింటికి వెళ్లడానికి ఈ మహిళ కొంకణ్ కన్య ఎక్స్ ప్రెస్ లో బయలుదేరింది. కొద్దిసేపటికే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. రైలు థానే రైల్వేస్టేషన్ చేరుకునే లోపే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమె పరిస్థితి గుర్తించిన తోటి ప్రయాణికులు.. టీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో రైలును థానే రైల్వేస్టేషన్ లో నిలిపివేశారు.

ముందస్తుగానే సమచారం అందుకున్న థానే రైల్వే అధికారులు… డాక్టర్ ను సిద్ధంగా ఉంచారు. రైల్వేస్టేషన్ లో ఏర్పాటు చేసిన వన్ రూపీ క్లీనిక్ కు తరలించారు. అక్కడ ఆమెకు సాధారణ కాన్పు జరిగింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు క్లీనిక్ సిబ్బంది వెల్లడించారు. తోటి ప్రయాణికులు, టీసీ సమయస్ఫూర్తిగా వ్యవహరించటంతో.. ఇద్దరు ప్రాణాలు కాపాడగలిగారు.
Also Read : నిప్పుల కొలిమి : వరల్డ్ 15 హాటెస్ట్ నగరాలు భారత్‌లోనే