నాగ్‌పూర్‌లో జిల్లా పరిషత్ ఎన్నికలలో బిజెపి ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజేతగా నిలిచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌కు చెందినవారు కావడం గమనించాల్సిన విషయం. అంటే బీజేపీలో అగ్రనేతల ప్రాంతంలోనే బీజేపీ ఓడిపోవటంలో బీజేపీకి ఘోర అవమానవమని చెప్పక తప్పదు.
ఈ ఓటమి మహారాష్ట్ర బీజేపీకి భారీ నష్టమని చెప్పకతప్పదు. ఈ ఎన్నికల్లో మొత్తం 58 సాట్లు ఉండగా వీటిలో కాంగ్రెస్ 31 సీట్లు సాధించగా, బిజెపికి 15 సీట్లు వచ్చాయి. ఎన్‌సిపి 10, సీడబ్ల్యూపి 1,శివసేన 1 దక్కించుకున్నాయి. జిల్లా పరిషత్, పంచాయతీకి మంగళవారం (జనవరి 8,2020)న ఎన్నికలు జరుగగా..జిల్లాలో 67 శాతం ఓటింగ్ నమోదైంది.
నాగ్‌పూర్‌తో పాటు, పాల్ఘర్, నందూర్‌బార్, వాషిమ్‌లలో కూడా బీజేపీ ఓడిపోయింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిస్ స్వగ్రామం ధపేవాడలో కూడా బీజేపీ జిల్లా పరిషత్ స్థానాన్ని కూడా కోల్పోయింది. కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓటమిపాలైంది.