Delhi: రైతులకు అధిక ధర ఇస్తానని రూ.3.5కోట్లు ఎగ్గొట్టిన వ్యాపారి

ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్.. 60మందికి పైగా రైతులను మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసింది. ప్రేమ్ చంద్ (60) అనే వ్యక్తి 64మంది రైతులకు అబద్ధాలు చెప్పి రూ.3.5కోట్లు వరకూ కాజేశాడు. నారెలా గోధుమ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టి భారీగా నష్టానికి గురయ్యాడు.

Cheating Farmers

Delhi: ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్.. 60మందికి పైగా రైతులను మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసింది. ప్రేమ్ చంద్ (60) అనే వ్యక్తి 64మంది రైతులకు అబద్ధాలు చెప్పి రూ.3.5కోట్లు వరకూ కాజేశాడు. నారెలా గోధుమ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టి భారీగా నష్టానికి గురయ్యాడు. పోయిన డబ్బు సంపాదించడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు.

రైతులకు అధిక ధర ఇస్తానంటూ.. నమ్మబలికి పాత రసీదులనే ఇచ్చి పంటను తీసుకున్నాడు. వారి ధ్యాన్యం మొత్తాన్ని అమ్మేసుకున్నాడు. ఒకొక్కరుగా రైతులంతా రావాల్సిన మిగతా డబ్బు కోసం అడుగుతుండటంతో షాప్ మూసేశాడు. రైతులు ఓ గ్రూపుగా మారి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు ఫైల్ చేసి విచారణ మొదలుపెట్టారు.

2017-2018 సంవత్సరానికి సంబంధించి పంటను అమ్ముకున్నట్లుగా తెలిసింది. వచ్చిన లాభాలకు అధిక వడ్డీ ఇస్తానని కూడా చెప్పాడు. రైతులంతా అతని షాప్, ఇల్లు కొన్ని కోట్ల విలువ చేస్తుందని నమ్మేసి అతని హామీని నమ్మగలిగారు.

రైతులు ఎప్పుడైతే తమ డబ్బు ఇవ్వాలని అడిగారో.. పరారీ అయ్యాడు. అప్పుడే తెలిసింది అతని షాపుతో పాటు ఇంటిని డబ్బు చెల్లించలేదనే కారణంతో బ్యాంకు వాళ్లు మూసేశారని. బ్యాంకు అతనికి చెందిన ఆస్తులను కూడా వేలం వేసింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారంట్ కూడా ఇష్యూ అయింది. ఆగష్టు 3న నిందితుడ్ని ఫరీదాబాద్ లో అరెస్టు చేశారు పోలీసులు.