Shashi Tharoor: శశి థరూర్ సభకు డిక్షనరీతో వచ్చిన ఓ వ్యక్తి.. తప్పేం లేదంటున్న నెటిజెన్లు

అప్పుడప్పుడూ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్‌ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయోగించిన కొన్ని పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి వెళ్లి వాటి అర్థాలు చూస్తుంటారు. కాబట్టి, శశిథరూర్ పాల్గొనే సభకి కనుక వెళ్లినట్లైతే మీ వెంట ఒక నిఘంటువును తీసుకెళ్లడం మంచిదంటూ చమత్కరిస్తుంటారు కూడా

Shashi Tharoor: అప్పుడప్పుడూ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్‌ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయోగించిన కొన్ని పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి వెళ్లి వాటి అర్థాలు చూస్తుంటారు. కాబట్టి, శశిథరూర్ పాల్గొనే సభకి కనుక వెళ్లినట్లైతే మీ వెంట ఒక నిఘంటువును తీసుకెళ్లడం మంచిదంటూ చమత్కరిస్తుంటారు కూడా. ఈ చమత్కారం తాజాగా నిజమైంది. అవును.. థరూర్ పాల్గొన్న ఒక సభకు ఒక వ్యక్తి ఆక్స్‭ఫర్డ్ డిక్షనరీతో వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో షేర్ చేస్తూనే, ఇందులో అంత పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటూ నెటిజెన్లు స్పందిస్తుండడం గమనార్హం.


నాగాలాండ్‌లో ఆర్.లుంగ్‌లెంగ్ హోస్ట్ చేసిన ‘లుంగ్‌లెంగ్ షో’ అనే టాక్ షోకి శశి థరూర్ హాజరయ్యారు. ప్రదర్శన సందర్భంగా రాష్ట్ర యువతతో థరూర్ సంభాషించారు. అయితే ఈ కార్యక్రమ హోస్ట్ అయిన ఆర్.లుంగ్‌లెంగ్ స్వయంగా ఒక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో ప్రదర్శనకు హాజరైన వ్యక్తి తనతో పాటు ఒక డిక్షనరీని తీసుకువెళ్లాడు. అది బహుశా కాంగ్రెస్ నాయకుడి పదజాలాన్ని అర్థంచేసుకోవడానికే అయ్యుంటుందని అందరూ అంటున్నారు. ఈ ఈ వీడియో షేర్ చూస్తూ “డాక్టర్ శశిథరూర్‌ ప్రసంగం వినడానికి నాగాలాండ్‌లోని ఎవరో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని నా షోకి తీసుకొచ్చారు. థరూర్ మీటింగుకి డిక్షనరీలు తేవడమనేది జోక్ అనే అనుకున్నాను. కానీ ఇది చూశాక అది నిజమని అనిపిస్తోంది” అని ట్వీట్ చేశారు.

By Polls: కఠిన భద్రత నడుమ నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్

ట్రెండింగ్ వార్తలు