చేతిలో గన్ పెట్టుకుని హీరోలా రెచ్చిపోయాడు ఓ వ్యక్తి. కారులో వచ్చినందుకు టోల్ ట్యాక్స్ కట్టమన్న పాపానికి గన్ తో బెదిరింపులకు దిగాడు. నానా హంగామా చేశారు. చివరకు టోల్ ట్యాక్స్ కట్టకుండా దర్జాగా చెక్కేశాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
టోల్ గేట్ వద్ద ఓ వ్యక్తి పిస్తోల్‌తో సిబ్బందిని బెదిరించి.. టోల్ ట్యాక్స్ కట్టకుండా వెళ్లిపోయాడు. గురుగ్రామ్‌లో ఉన్న టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ సంఘటన సీసీటీవీ ఫూటేజ్ లో రికార్డ్ అయ్యింది. కాగా ఈ ఘటనపై పోలీసులకు టోల్ ప్లాజా సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తి కోసం గాలిస్తున్నారు. టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న ఓ కారు నుంచి దిగిన ఓ వ్యక్తి తన చేతిలో పిస్తోల్‌తో సిబ్బందిని బెదిరించాడు. టోల్ గేటు తెరుచుకున్న తర్వాత ట్యాక్స్ కట్టకుండా కారులో ఉడాయించాడు. సీసీ టీవీ పుటేజ్ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.
#WATCH Haryana: A man brandished a pistol at a toll plaza in Gurugram and fled without paying toll tax. Police have registered a case (15.5.19) pic.twitter.com/mhcsdxXmCu
— ANI (@ANI) May 16, 2019