Disohonour Killing
Dishonour Killing: గ్రేటర్ నోయిడాలో అనుమానస్పద రీతిలో మరో పరువు హత్య నమోదైంది. గ్రేటర్ నోయిడాలోని హైవే మీద 25ఏళ్ల వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేశారు. రాజు అతని మరదలిని తీసుకుని వస్తుండగా ఈ దారుణం జరిగింది. పరీ చౌక్ సమీపంలోని ఘటనాస్థలంలో రాజు మృతదేహం పక్కనే ఉన్న మహిళను గుర్తించారు పెట్రోలింగ్ పోలీసులు.
స్థానిక హాస్పిటల్ లో అడ్మిట్ చేసి చికిత్స ఇప్పించారు. ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ వాసి అయిన వ్యక్తితో చాలా కాలంగా ప్రేమలో ఉంది యువతి. ఇల్లు వదిలి ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలోనే నోయిడా, గ్రేటర్ నోయిడా చేరుకున్నారు.
‘గ్రేటర్ నోయిడాలోని పరీ చౌక్ వద్ద యువతి సోదరులు వారిని అడ్డుకున్నారు. ఇటుకలు, రాళ్లతో వారిపై దాడి చేశారు. సోదరి గాయాలపాలవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత్ కుమార్ వెల్లడించారు.
……………………………. : సీఎం కేసీఆర్ క్రిస్మస్ విందు
గాయాలతో రాజు మృతి చెందగా, యువతి స్పృహ లేకుండా పడి ఉందని పోలీసులు పేర్కొన్నారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి నిందితులను సొంత గ్రామంలోనే అరెస్టు చేశారు.
‘మహిళ స్టేట్మెంట్ ఆధారంగా సోదరులను అరెస్టు చేశాం. విచారణ నిమిత్తం నోయిడా తీసుకొస్తాం. కేసులో మరిన్ని సాక్ష్యాల కోసం గాలిస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు.