ఆర్మీ జవాన్ల రక్షణగా : ‘ఐరన్ మ్యాన్’ స్యూట్ ఇదిగో 

  • Publish Date - November 19, 2019 / 09:16 AM IST

వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో దేశ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. దేశ రక్షణ కోసం పాటుపడే భారత ఆర్మీ జవాన్ల రక్షణ కోసం ఓ స్యూట్ రూపొందించాడో వ్యక్తి. అదే.. ఐరన్ మ్యాన్ స్యూట్. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడే సమయంలో రక్షణగా ఈ ఐరన్ స్యూట్ ఎంతో ఉపకరిస్తుందని చెబుతున్నాడు. వారణాసిలోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో శ్యామ్ చౌరాసియా అనే వ్యక్తి పార్ట్ టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

అశోకా ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ లో పనిచేస్తున్న శ్యామ్.. ఇండియన్ ఆర్మీ సైనికులను దృష్టిలో పెట్టుకుని ప్రోటోటైప్ స్యూట్ డిజైన్ చేశాడు. ‘ఇదొక మెటల్ స్యూట్. తీవ్రవాదులతో ఎన్ కౌంటర్ ఆపరేషన్ సమయలో ఈ ఐరన్ స్యూట్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం.. ఇదొక ప్రొటోటైప్ మాత్రమే. కానీ, పోరాట సమయాల్లో సైనికులకు బ్రహ్మాండముగా పనిచేస్తుంది ’ అని శ్యామ్ చెప్పుకొచ్చాడు. ‘

ఈ స్యూట్ లో గేర్స్, మోటార్స్ తో రూపొందించాం. దీనికి మొబైల్ కనెక్షన్ కూడా ఉంది. రీమోట్లీ ఆపరేట్ చేసుకోనేలా డిజైన్ చేశాం. ఇందులోని సెన్సార్ల సాయంతో జవాన్లు వెనుక నుంచి కూడా దాడి చేయొచ్చు’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఐరన్ స్యూట్.. తగరం బట్టతో చేస్తున్నారు. కానీ, మోడల్ స్యూట్ డిజైన్ చేయాలంటే అధిక నిధులు అవసరమని శ్యాం చెబుతున్నాడు. 

ఐరన్ స్యూట్ విషయంలో.. ప్రభుత్వ సంస్థలైన DRDOలను కోరాను. పాకిస్థాన్ సహా ఇతర దేశాలు కూడా తమ దేశ జవాన్ల కోసం ఈ తరహా స్యూట్లను రూపొందించడంపై  పనిచేస్తున్నాయని చెప్పాడు. జవాన్ల జీవితాలు ఎంతో విలువైనవి, వాళ్లను రక్షించుకోవాల్సి అవసరం ఎంతైన ఉందని తెలిపాడు. ఈ ఐరన్ స్యూట్.. డీఆర్డీఓ ర్యాడర్ సహా ఇతర
ఏజెన్సీలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నిం చేస్తున్నట్టు తెలిపాడు. 

ట్రెండింగ్ వార్తలు