man dies during sex, girlfriend's husband helps dump body
Bengaluru: ఓ వ్యక్తి శృంగారం మధ్యలో గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. అనంతరం ఆయన గర్ల్‌ఫ్రెండ్ తన భర్తకు ఫోన్ చేసి, అతడి సాయంతో శవాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగులో సర్ధి బయట పడేశారు. ఇందుకు సదరు మహిళ సోదరుడు సైతం సాయం చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిందీ ఘటన. కాగా, ఈ ఘటన జరిగిన వారం రోజుల అనంతరం పోలీసులు శవాన్ని తాజాగా గుర్తించారు.
చనిపోయిన వ్యక్తి(67) ఒక వ్యాపారవేత్త. పేరు బాల సుబ్రమణ్యం. బెంగళూరులోని జేపీ నగర్‌లోని పుట్టెనహళ్లి నివాసి. ఆయనకు తన ఇంట్లో పని చేసే మహిళ(35) శారీరక సంబంధం ఉంది. నవంబర్ 16న ఉదయమే బ్యాడ్మింటన్ ఆట పూర్తి చేసుకుని, తన ఇంట్లో పని చేసే సదరు మహిళ ఇంటికి ఆయన వెళ్లాడు. అనంతరం ఆమెను తీసుకుని నేరుగా హోటల్ గదికి తీసుకెళ్లాడట. అక్కడ ఆమెతో శృంగారం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అంతే, అక్కడికక్కడే మరణించాడు. సాయంత్రం 4:55 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు రికార్డు చేశారు.
బాల సుబ్రమణ్యం మరణంతో ఉక్కిరిబిక్కిరైన సదరు మహిళ.. వెంటనే తన భర్తకు, సోదరుడికి సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని ఒక ప్లాస్టిక్ బ్యాగులో బాల మృతదేహాన్ని కుక్కేసి బయట పడేశారు. అయితే ఎప్పుడైనా ఏదైనా పనుంటే ఇంటికి ఆలస్యంగా వస్తారని అనుకున్న కుటుంబ సభ్యులు, ఆ రోజు బాల రాకపోవడంపై కూడా అలాగే అనుకున్నారు. అయితే ఫోన్ తగలకపోవడం, ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
విచారణలో భాగంగా బాల ఇంట్లో పని చేసే ఆ మహిళను పోలీసులు ప్రశ్నించే సమయంలో ఆమె వణికిపోతూ ఉండడాన్ని గమనించి, గట్టిగా అడగ్గా విషయం బయట పడింది. అనంతరం ఆమె భర్త, సోదరుడిని పిలిచి విచారించి, ఘటన వివరాలు తీసుకున్నారు. ఈ ముగ్గురిపై మర్డర్ కేసు నమోదు చేసి కేసుపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Viral Audio: రహస్య భాగాలు కత్తిరిస్తానంటూ మహిళ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత