Madhya Pradesh : కాల యముడిగా మారిన భర్త.. భార్యను తాడుతో కట్టి బావిలోకి తోసేసి .. వీడియో తీస్తూ

భర్తే ఆమె పాలిట కాల యముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను తాడుతో కట్టేసి బావిలోకి తోసేసి కిరాతకంగా చంపేసాడు. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం జరిగింది.

Madhya Pradesh

Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. కట్నం కోసం భార్యను దారుణంగా చంపాడో వ్యక్తి. ఆమెను తాడుతో కట్టి బావిలోకి తోసేసి చంపేసాడు. తను చేసిన అరాచకాన్ని వీడియో తీసి ఆమె పుట్టింటివారికి పంపాడు.

Hyderabad: 3 నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. 8 పేజీల లేఖ రాసి, రైలు కిందపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

వరకట్నం కోసం భార్యను వేధించి అమానుషంగా చంపేసాడో భర్త. మధ్యప్రదేశ్ నీముచ్‌లో ఈ దారుణం జరిగింది. రాకేష్ కిర్ అనే వ్యక్తి భార్య ఉషను తాడుకి కట్టి బావిలోకి తోసేసాడు. ఆమె నీట మునిగి చనిపోయే వరకూ మొత్తం వీడియో తీసి తన భార్య బంధువులకు పంపించాడు. ఉష పుట్టింటి వారు వీడియో చూసి గ్రామంలో కొందరికి ఫోన్ చేసిన తమ కూతురికి రక్షించాల్సిందిగా అభ్యర్ధించారు. అప్పటికే ఉష చనిపోయింది.

Deepthi Case: కోరుట్ల దీప్తిది హత్యేనని తేల్చేసిన పోలీసులు?

ఉష కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రాకేష్‌ను అరెస్ట్ చేసారు. రాకేష్ రూ.5 లక్షలు కట్నం కోసం ఉష చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.