మండ్య ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్
- venkaiahnaidu
- Published On : July 6, 2020 / 09:09 PM IST
ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు.
భర్త అంబరీశ్ మరణాంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, 2019 లోక్ సభ ఎన్నికల్లో మండ్ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి అప్పటి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడపై సుమలత ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సుమలత తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషా చిత్రాల్లో నటించారు.
