అభినందన్ కు ‘మంగళ్‌యాన్‌’ స్వాగతం: వీరుడా అభినందనలు 

  • Publish Date - March 3, 2019 / 04:11 AM IST

ఢిల్లీ : మరణం చేరువలోనే ఉన్నా..చెక్కు చెదరని గుండె ధైర్యం అని సొంతం.  శతృవుల చేతిలో చిక్కినా సడలని ఆత్మస్థైర్యాన్ని నిలువెత్తు నిదర్శనం భారత్ విండ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. ఇప్పుడతను విశ్వవిజేయుడుగా నీరాజరాలు అందుకుంటున్నారు. పాక్ చెర నుంచి భారత్ కు వచ్చిన అభినందన్ అరుదైన..అద్భుతమైన స్వాగతాన్ని అందుకున్నారు. ఆయన రాక కోసం యావత్‌ దేశం సరిహద్దుల్లో కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూసింది. 
 

అజరామరమైన అతడి శౌర్యం, త్యాగశీలత ప్రశంసల జల్లులా కురిసింది. సోషల్‌ మీడియాలో అభినందన్‌ని కృతజ్ఞతాభినందనలతో ముంచెత్తారు. అటువంటి అద్భుతమైన సందర్భంలో ఆయనకు ఆకాశమే స్వయంగా స్వాగతం పలికింది. విశ్వాంతరాళాల్లోని మరో గ్రహం నుంచి అభినందన్‌కు అభినందనలు అందాయి. భారతీయుల సృష్టితో అంగారక గ్రహంపై అడుగుపెట్టిన మంగళ్‌యాన్‌ (మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌) అభినందన్‌కు నిండైన ఆహ్వనం పలికింది.
 

పూర్తి స్వదేశీ పరిజ్నానంతో మన తెలుగు గడ్డపై తయారై.. అంగారక గ్రహంలోకి పంపిన మంగళ్‌యాన్‌ మిషన్‌ ఇస్రో అధికారిక ట్విటర్‌ ‘వింగ్‌ కమాండర్‌ అభినందన్‌! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’అని ట్వీట్‌ చేసింది. ఒక వీరుడి జీవితంలో ఇంతటి అరుదైన, అద్భుతమైన అవకాశం ఎవరికీ దక్కకటం అత్యంత విశేషయంగా చెప్పుకోకతప్పదు. ఇటువంటి అవకాశం మరెవరకీ దక్కకపోవచ్చుకూడా. అంతరిక్షం నుంచి మంగళ్‌యాన్‌ భూమిపైకి పంపిన రెండో మెసేజ్‌ ఇది. గత ఏడు నెలల్లో అంగారకుడి నుంచి ఏకైక సందేశం కూడా ఇదే. అంతకుముందు గతేడాది సెప్టెంబర్‌ 29న అంగారకగ్రహంపై తన నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మంగళ్‌యాన్‌ ఓ సందేశాన్ని పంపింది. మంగళ్‌యాన్‌ ఆవిష్కరణ ముందు 2013లో ఇస్రో అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్‌ అకౌంట్లను ప్రారంభించి సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంది. అయితే 2014లో మంగళ్‌యాన్‌ పేరిట అధికారిక ఖాతా తెరిచింది. ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు విశ్వతంతరాళం స్వయంగా స్వాగతం పలకటం అద్భతం..అత్యద్భుతం అని అని చెప్పటం అభినందన్ దేశభక్తికి తార్కాటం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.