Manish Sisodia : జైలు నుంచి ఇంటికెళ్లాక భార్య ఫొటోను పోస్టుచేసి మనీశ్ సిసోడియా ఆసక్తికర ట్వీట్
జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన రాత్రి తన నివాసానికి వెళ్లారు. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు.
- Harishth Thanniru
- Published On : August 10, 2024 / 08:47 AM IST
manish sisodia
Manish Sisodia : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో 17 నెలల తరువాత సిసోడియా జైలు నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. దీంతో సిసోడియాకు ఆప్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏదైనా నియంతృత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష నేతలను నియంతృత్వ చట్టాలను రూపొందించి కటకటాలకు పంపిస్తే.. మీ ప్రేమ, భగవంతుడి ఆశీస్సులు, సత్యశక్తి, అన్నింటికంటే పెద్దగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేను జైలు నుంచి బయటకు వచ్చానని అన్నారు. అనంతరం ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని కేజ్రీవాల్ నివాసానికి సిసోడియా వెళ్లారు.
Also Read : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటివద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత.. నా కథకు డైవర్స్ తోనే స్వస్తి పలుకుతానన్న శ్రీనివాస్
జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన రాత్రి తన నివాసానికి వెళ్లారు. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. తన భార్యతో కలిసి టీ తాగుతున్న ఫొటోను సిసోడియా పోస్టు చేశారు. 17 నెలల తరువాత ఇంట్లో టీ తాగుతున్నానని అన్నారు. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది. అందరితోపాటు కలిసి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ భగవంతుడు మనకు ప్రసాదించాడు అంటూ మనీశ్ సిసోడియా ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read : Pawan Kalyan : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పవన్ సంచలన నిర్ణయం.. ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి..
आज़ादी की सुबह की पहली चाय….. 17 महीने बाद!
वह आज़ादी जो संविधान ने हम सब भारतीयों को जीने के अधिकार की गारंटी के रूप में दी है।
वह आज़ादी जो ईश्वर ने हमें सबके साथ खुली हवा में साँस लेने के लिए दी है। pic.twitter.com/rPxmlI0SWF
— Manish Sisodia (@msisodia) August 10, 2024
