లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు వెళ్తుండగా..జరిగిన ఈ దాడిలో మాండవీతో పాటు ఆయన నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఏప్రిల్ 9న జరగింది.
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్
ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 18)న ఉదయం పోలీసులు దంతెవాడ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తుండగా..మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతు..బీజేపీ ఎమ్మెల్యే మాండవీని మందుపాతరతో చంపిన ఇద్దరు మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో హతమయ్యారని తెలిపారు. హతమైన మావోయిస్టులను వర్గీస్, లింగాగా పోలీసులు గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో మిలిషీయా సభ్యుడు ఒకరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి తుపాకులు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Chhattisgarh: 2 naxals, including an ACM Vargese – involved in the attack where BJP MLA Bhima Mandavi & 5 police personnel were killed,
were killed in an encounter with District Reserve Guard (DRG) in forest area of Dhanikarka under Kuakonda police station limits earlier today. pic.twitter.com/ktkNe56ook— ANI (@ANI) April 18, 2019