పెళ్లైనా ప్రేమించిన అమ్మాయితో ఉండొచ్చు : హైకోర్టు సంచలన తీర్పు

  • Publish Date - March 26, 2019 / 06:13 AM IST

రాజస్థాన్ : వివాహం చేసుకుని భార్య ఉన్న వ్యక్తి మరో మహిళతో కలిసి ఉంటే అది చట్టవిరుద్ధమని చట్టం చెబుతుంది. కానీ పెళ్లయిన వ్యక్తిని ప్రేమించిన యువతిని అతనితో కలిసి ఉండొచ్చు అంటు రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఓ కేసు విచారణ విషయంలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు సందీప్‌ మెహతా, వినిత్‌ కుమార్‌ మథూర్‌ లు ఈ మేరకు తీర్పునిచ్చారు.
 

పెళ్లయి..ఇద్దరు పిల్లలు కూడా  ఉన్న మొయినుద్దీన్ అనే వ్యక్తిని పాల్‌ సోనీ అనే 26 ఏళ్ల యువతి  ప్రేమించింది. భార్యా పిల్లలు ఉన్న వ్యక్తితో పెళ్లికి ఏ యువతి తల్లిదండ్రులు ఒప్పుకోరు. అలాగే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకలేదు. దీంతో మొయినుద్దీన్..సోనీలు ఇంటర్ ఫెయిత్ (నమ్మకం) వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇది తెలిసిన సోనీ తల్లిదండ్రులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె కోసం మొయినుద్దీన్ హెబియస్‌ కోర్టులో  కార్పస్‌ పిటిషన్‌ వేశాడు. దీంతో సోనీని మార్చి 13న పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును క్షణ్ణంగా విచారించిన మీదట ఆమె భవిష్యత్తు..తదనంతర పరిణామాల గురించి సోనీకి కౌన్సిలింగ్‌ ఇప్పించారు. అయినా సోనీ మొయినుద్దీన్ తోనే ఉంటానని తేల్చి చెప్పింది. దీంతో సోనీ మేజర్ కావడంతో  మానసిక పరిపక్వత గల యువతిగా భావించిన న్యాయమూర్తులు సోనీ- మొయినుద్దీన్‌ తో కలిసి ఉండేలా తీర్పునిచ్చారు.