Noida Fire Incident: ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. నోయిడాలో ఘోరం
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా(Noida Fire Incident)లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడం వల్ల సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- July 15, 2026 / 03:26 PM IST
Massive fire caused by an electric vehicle in a building in Noida, two deaths
- నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల ప్రమాదం
- ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
Noida Fire Incident: నేటి కాలంలో ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) వాడకం పెరుగుతున్నప్పటికీ, వాటి వల్ల జరిగే ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడం వల్ల సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. మామురా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Assigned Lands Case: అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు ఊరట.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బహుళ అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్‌లో ఉంచిన ఎలక్ట్రిక్ బైక్‌లో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు(Noida Fire Incident) వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు, దట్టమైన పొగ భవనం పైకి చేరడంతో నివాసితులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది రంగంలోకి దిగి 50 కుటుంబాలను సురక్షితంగా రక్షించారు.
ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆరా తీశారు. బాధితులకు తక్షణమే మెరుగైన సహాయక, వైద్య చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ఏరియా నుంచి పొగ వేగంగా పై అంతస్తులకు వ్యాపించడమే ఈ ప్రాణనష్టానికి ప్రధాన కారణమని జాయింట్ కమిషనర్ రాజీవ్ నారాయణ్ వెల్లడించారు. ఈ ప్రమాదం ఈవీ వాహనాల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.
