Nitin Gadkari on E20 Fuel : ఎక్కువ డబ్బులు పెట్టి 100శాతం పెట్రోల్ కొట్టించుకోండి.. విమర్శకులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచన
Nitin Gadkari on E20 Fuel : ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) పై వస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Nitin Gadkari
Nitin Gadkari on E20 Fuel : ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) పై వస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. E20 ఇంధనంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, వాహనాల్లో తలెత్తే ప్రతి సాంకేతిక సమస్యకు ఇదే కారణమని అనడం సరికాదని, వాహనంలో లోపం తలెత్తితే ముందుగా సాంకేతిక తనిఖీ చేయించుకోవాలని, ఆధారాలు లేకుండా E20 ఇంధనమే కారణం అంటూ నిందించడం సరికాదని గడ్కరీ అన్నారు.
Also Read : India – UK FTA : భారత్ – యూకే డీల్ అమల్లోకి వచ్చేసింది.. భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరలు..
దేశవ్యాప్తంగా E20 ఇంధనం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ20 ఆయిల్ వల్ల మైలేజ్ తగ్గిపోవటమే కాకుండా.. వాహనాల్లో పార్ట్స్ దెబ్బతింటున్నాయని చాలా మంది వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వద్దు అనుకుంటే వాహన యజమానులు 100శాతం పెట్రోల్‌ను కొట్టించుకోవచ్చు.. ఇది వాళ్ల ఛాయిస్. ఈ20 ఆయిల్ వద్దనుకుంటే పవర్ పెట్రోల్ కొట్టించుకోవచ్చు.. దీనికి అదనంగా డబ్బు చెల్లిస్తే సరిపోతుంది కదా అంటూ గడ్కరీ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
దేశంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహించడం వల్ల చమురు దిగుమతులు తగ్గడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని గడ్కరీ పేర్కొన్నారు. అయితే, ఎథనాల్‌లో శక్తి విలువ (క్యాలరిఫిక్ వాల్యూ) పెట్రోల్ కంటే తక్కువగా ఉండటంతో E20 ఇంధనం వాడితే మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని గడ్కరీ అంగీకరించారు. ఇది చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుందని, ప్రధానంగా అధిక వేగంతో ప్రయాణించే సమయంలో మాత్రమే ఆ ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. ఇంజిన్‌కు ఎలాంటి నష్టం జరగదని కూడా గడ్కరీ స్పష్టం చేశారు.
ఎథనాల్ విధానం వల్ల తన కుటుంబ వ్యాపారాలకు లాభం చేకూరుతుందన్న ఆరోపణలను గడ్కరీ కొట్టిపారేశారు. తన కుమారుల వ్యాపారంలో ఎథనాల్ ఉత్పత్తి చాలా చిన్న భాగమేనని, తనపై వస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన అన్నారు.
