Lockdown
Lockdown Announcement: ముంబై మేయర్ కిషోరీ పడ్నేకర్ త్వరలోనే సిటీలో లాక్‌డౌన్ అనౌన్స్ చేయనున్నట్లు హింట్ ఇచ్చారు. దాదాపు ఈ నిర్ణయాన్ని శుక్రవారం నుంచి అమలు చేసే పనిలో పడింది ప్రభుత్వం. గడిచిన 24గంటల్లో 8వేల 646కేసులు నమోదుకాగా, 18మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసులు 4లక్షల 23వేల 360కేసులు నమోదవగా మొత్తం మృతులు 11వేల 704కు చేరాయి.
బుధవారం వరకూ అందిన సమాచారాన్ని బట్టి మహారాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా లాక్‌డౌన్ విధించే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 2న దీనిపై ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే.. రాష్ట్రంలో కొవిడ్ కేసులు, మృతులు పెరగకుండా ఉండేందుకు నిబంధనలను పెంచాలని అధికారులకు సూచించారు. మరోవైపు ఠాకరే అడ్మినిస్ట్రేషన్ కు కంప్లీట్ లాక్ డౌన్ కు కూడా రెడీగా ఉండాలని సూచనలు ఇచ్చారు. ప్రతిపక్షాలతో సహా పూర్తి లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక నష్టం తప్పదని వాదిస్తున్నారు.
సినిమాలు, రిటైల్, షాపింగ్ ఇండస్ట్రీలు గురువారం నుంచి లాక్‌డౌన్ విధించవద్దంటూ ఠాకరే ప్రభుత్వాన్ని కోరుతుంది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు తాము సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తున్నామని గవర్నమెంట్ చెప్పినట్లుగానే నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు.
చిన్న స్థాయి నుంచి భారీ పరిశ్రమల వరకూ లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక నష్టం తప్పదని మొరపెట్టుకుంటుంటే.. ప్రభుత్వం కొవిడ్ ప్రభావం నుంచి బయటపడేందుకు ఏం చేస్తుందో చూడాలి మరి.