Mastercard ban: మాస్టర్ కార్డ్ సేవలు పునరుద్ధరించాలని ఆర్బీఐ సూచన

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్ లో భాగంగా మాస్టర్ కార్డ్ నిషేదాన్ని ఎత్తేయాలని సూచించింది. కొద్ది రోజుల క్రితమే అమెరికాకు చెందిన ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్‌ (Master Card)ను నిషేదించాలని చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Mastercard ban: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్ లో భాగంగా మాస్టర్ కార్డ్ నిషేదాన్ని ఎత్తేయాలని సూచించింది. కొద్ది రోజుల క్రితమే అమెరికాకు చెందిన ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్‌ (Master Card)ను నిషేదించాలని చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

‘Payment and Settlement Systems Act, 2007 (PSS Act)’ కింద పేమెంట్ వ్యవస్థల డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలంటూ ఆర్బీఐ అన్ని పేమెంట్ సర్వీస్ సంస్థలను 2018 ఏప్రిల్‌లోనే ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు 6 నెలల గడువు కూడా విధించగా.. మాస్టర్ కార్డ్ ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేయలేదు. దాంతో ఆర్బీఐ మాస్టర్ కార్డుపై జారీని నిలిపివేసింది. గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించగా ఈ సంస్థలపై కూడా ఆర్బీఐ ఆంక్షలు విధించింది.

ఇప్పటికే జారీ చేసిన మాస్టర్ కార్డ్ కస్టమర్ల విషయంలో మాత్రం యథాతథంగా తమ సర్వీసులను కొనసాగించేందుకు అనుమతులు ఉండగా.. మరి కొత్త కార్డుల విషయంలో ఆయా సర్వీసులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

ఒకవేళ మాస్టర్ కార్డులు ఇష్యూ చేయడానికి నిరాకరిస్తే.. ఆయా బ్యాంకులు వీసా లేదా రూపే కార్డులను ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం క్రెడిట్ కార్డులకు మాత్రమే అయితే సరిపోదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వందల్లో అకౌంట్లు ఓపెన్ మాస్టర్ కార్డులు ప్రొవైడ్ చేసేవి.

ట్రెండింగ్ వార్తలు