Meghalaya man arrested for shares video of evm that sends all votes to bjp
Meghalaya: ఎన్నికల పోలింగులో ఉపయోగించే ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)ల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక అధికారంలో ఉన్నవారిపై ఈవీఎం ద్వారా చేసే విమర్శలు తక్కువేమీ కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈవీఎం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందుతోందని విపక్షాలు తరుచూ విమర్శిస్తూనే ఉంటాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని, ఏ పార్టీ గుర్తుకు ఓటేసినా, బీజేపీ కమలానికి ఓటు వెళ్లేలా మారుస్తున్నారంటూ ఆరోపిస్తుంటారు. ఇది నిజమా అన్నట్లు ఒక వ్యక్తి షేర్ చేసిన వీడియో షాకింగుకు గురి చేసింది.
Israeli Missile Strikes Damascus: సిరియా రాజధానిపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. 15మంది మృతి
ఈ వ్యక్తి షేర్ చేసిన వీడియోలో ఈవీఎం మిషన్లో ఏ బటన్ నొక్కినా ఓటు మాత్రం కమలం పార్టీకే వెళ్లడం కనిపించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు (ఫిబ్రవరి 16) ఆ వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో షేర్ చేసినందుకు గాను మేఘాలయకు చెందిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. కారణం, అతడు షేర్ చేసింది తప్పుడు వీడియో. ఎన్నికల సంఘం ఉపయోగించే ఈవీఎం మిషన్ కాదది. సదరు వ్యక్తిని బోలోంగ్ ఆర్ సంగ్మా అని పోలీసులు వెల్లడించారు.
Uddhav Thackeray: ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు
రోంగ్జెంగ్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, సోషల్ మీడియా పోస్టు ఆధారంగా దర్యాప్తు చేసి సంగ్మాను అరెస్ట్ చేశారు. అతడి మీద భారత శిక్షస్మృతిలోని 171-జీ (ఎన్నికలకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం చేయడం) కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎన్నికల అధికారి ఖర్కోంగోర్ తెలిపారు. ఈవీఎంలు లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ట్యాంపర్ ప్రూఫ్ లేదంటే ఏదైనా అవకతవకలకు ప్రయత్నించినట్లయితే ఫ్యాక్టరీ రీసెట్ మోడ్‌కు వెళ్తాయని, ప్రతి స్థాయిలో అనేక రక్షణలు ఉన్నాయని ఖర్కోంగోర్ తెలిపారు.