Melinda Gates Meet UP CM: యూపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది.. సీఎం ఆధిత్యనాథ్‌తో మెలిండా గేట్స్ భేటీ..
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్. ఇద్దరూ 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, 27ఏళ్ల వారి వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బిల్ - మెలిండాలు కలిసి ఏర్పాటు చేసిన బిల్ - మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను సంయుక్తంగానే నడుపుతున్నారు.
- Harishth Thanniru
- Published On : December 9, 2022 / 11:38 AM IST
Melinda Gates
Melinda Gates Meet UP CM: ఆరోగ్య భద్రత, ఆర్థిక సమ్మేళనం, పోషకాహారం, విద్య, మహిళా సాధికారత తదితర రంగాలలో యుపీ ప్రభుత్వం చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని, ఉత్తరప్రదేశ్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మెలిండా గేట్స్ అన్నారు. మెలిండా గేట్స్ యూపీ సీఎం ఆధిత్యనాథ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయ రంగాలలో సాంకేతిక సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు.
Melinda Gates: తొలిసారి బిల్ గేట్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మెలిండా
కొవిడ్-19 కట్టడి, మెదడువాపు, వంటి వ్యాధుల నియంత్రణకోసం యూపీలో ఇటీవల చేసిన కృషి ఆదర్శప్రాయమని మెలిండా కొనియాడారు. టీకా పంపిణీని కూడా ఆమె ప్రశంసించారు. యూపీతో ఫౌండేషన్ యొక్క బలమైన సంబంధాల గురించి మెలిండా మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఆరోగ్యం, సామాజిక భద్రత రంగంలో చాలా కాలంగా పని చేస్తున్నామని తెలిపారు. సమాజంలోని అత్యంత బలహీన, చివరి వ్యక్తికి కూడా సౌకర్యాలు కల్పించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇదిలాఉంటే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10-12 తేదీల్లో లక్నోలో జరగనున్న ప్రతిపాదిత యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనాలని మెలిండా, ఆమె సహచరులను యూపీ సీఎం ఆహ్వానించారు.
Bill Gates Daughter : కరోనా నిబంధనల మధ్య ‘బిల్ గేట్స్’ కుమార్తె వివాహం.. ఖర్చు ఎంతంటే
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్. ఇద్దరూ 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, 27ఏళ్ల వారి వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బిల్ – మెలిండాలు కలిసి ఏర్పాటు చేసిన బిల్ – మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను సంయుక్తంగానే నడుపుతున్నారు. బిల్ గేట్స్‌తో విడిపోయిన తర్వాత తాను భరించలేని వేదనకు గురైనట్టు కూడా మెలిండా గేట్స్ ఇటీవల ఓ జాతీయ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
