Melinda Gates: తొలిసారి బిల్ గేట్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మెలిండా

బిల్ గేట్స్ మాజీ భార్య విడాకుల తర్వాత తొలి సారి మీడియాతో మాట్లాడారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. బిల్ గేట్స్ పరిచయాలపై మండిపడ్డారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన....

Melinda Gates: తొలిసారి బిల్ గేట్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మెలిండా

Melinda Gates

Melinda Gates: బిల్ గేట్స్ మాజీ భార్య విడాకుల తర్వాత తొలి సారి మీడియాతో మాట్లాడారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. బిల్ గేట్స్ పరిచయాలపై మండిపడ్డారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌‌ను అనేక సార్లు కలిసినట్లు వెల్లడించారు.

బాలికలపై లైంగిక వేధింపులు, మహిళల అక్రమ రవాణా లాంటి కేసుల్లో దోషిగా తేలిన ఎప్‌స్టీన్‌‌కు శిక్ష పడగా.. 2019లో జైల్లోనే అనుమానాస్పదంగా మరణించాడు.

బిల్ గేట్స్ మాత్రమే కాకుండా తాను కూడా ఓసారి ఎప్‌స్టీన్‌ను కలిశానని వెల్లడించిన మిలిండా అదో పీడకలగా అభివర్ణించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే వ్యక్తి బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌లో పనిచేసిన మాజీ ఉద్యోగి.

‘ఆ వ్యక్తి ఎవరో చూడాలనుకుని గుమ్మంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి బాధపడుతూనే ఉన్నా’’ అని వివరించారు. ఎప్‌స్టీన్‌ది ‘అసహ్యకరమైన’, ‘చెడు వ్యక్తిత్వం’గా అభివర్ణించిన ఆమె.. తన భర్తతో కలవొద్దని చెప్పిందా.. లేదా? అనేది చెప్పడానికి నో చెప్పారు.

Read Also: బిల్ గేట్స్‌కు కోపమెక్కువ, మహిళలంటే మక్కువ.. -మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు

బిల్ గేట్స్‌ నుంచి విడిపోవడానికి ఎప్‌స్టీన్‌తో రిలేషన్‌షిప్ ప్రధాన కారణమా? అనే ప్రశ్నకు అనేక కారణాలలో ఇదొకటి అని బదులిచ్చారు.

1975లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన గేట్స్.. 2000లో ఆ సంస్థ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2008లో పూర్తిగా బాధ్యతల నుంచి వైదొలగి 2020 బోర్డు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

లైంగిక నేరాలకు పాల్పడి దోషిగా తేలిన వ్యక్తితో బిల్‌గేట్స్‌ సన్నిహితంగా మెలగడంపై ప్రశ్నిస్తే.. తాను ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే చర్చిస్తున్నానని బిల్‌గేట్స్‌ 2013లో ఈ ప్రచారంపై వివరణ ఇచ్చారు. 2011 నుంచి ఎప్‌స్టీన్‌ను బిల్‌గేట్స్‌ తరుచూ కలుస్తూనే ఉండేవారని మెలిండా అన్నారు.