Bill Gates: బిల్ గేట్స్‌కు కోపమెక్కువ, మహిళలంటే మక్కువ.. -మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విడాకులు తీసుకున్న తర్వాత అతని వ్యక్తిత్వం గురించి ప్రతీరోజూ కామెంట్లు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా బిల్‌గేట్స్ ఓ "ఆఫీసు రౌడీ" అంటూ.. తన మహిళా సహోద్యోగులను వేధించాడంటూ సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Bill Gates: బిల్ గేట్స్‌కు కోపమెక్కువ, మహిళలంటే మక్కువ.. -మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు

Bill Gates (1)

Bill Gates ‘office bully’: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విడాకులు తీసుకున్న తర్వాత అతని వ్యక్తిత్వం గురించి ప్రతీరోజూ కామెంట్లు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా బిల్‌గేట్స్ ఓ “ఆఫీసు రౌడీ” అంటూ.. తన మహిళా సహోద్యోగులను వేధించాడంటూ సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేటెస్ట్‌గా బిల్‌గేట్స్ బయోగ్రఫీ రాసిన జేమ్స్‌ వాల్లేస్‌.. గేట్స్‌ లోకల్‌ నైట్‌ క్లబ్‌ల నుంచి అమ్మాయిల్ని పిలిపించుకుని, వారితో నగ్నంగా స్విమ్ చేసేవాడని, వాళ్ల చుట్టూ తిరిడమే పనిగా పెట్టుకునేవాడని, తప్పతాగి జల్సాలు చేసేవాడని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే, బిల్‌గేట్స్‌కు కోపం ఎక్కువని, కారణం లేకుండా అరిచేవారంటూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు చెప్పారంటూ ఇంటర్నేషనల్ మీడియా ఛానెల్ బిజినెస్ ఇన్‌సైడర్ తన కథనంలో వెల్లడించింది. బిజినెన్ ఇన్‌సైడర్ తన రిపోర్ట్‌లో నలుగురు మైక్రోసాఫ్ట్ మహిళా ఉద్యోగులను ప్రస్తావించింది.

వారి నివేదికల ప్రకారం.. ఓ మాజీ మహిళ ఎగ్జిక్యూటివ్ బిల్‌ గేట్స్‌తో సమావేమైనప్పుడు ఆయన అరుస్తూనే ఉంటారని, కాబట్టి నేను సమావేశానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను” అని చెప్పారు.

మరో మాజీ ఎగ్జిక్యూటివ్ మాత్రం గేట్స్ ఎప్పుడూ నిజాయితీగా ఉంటారని, మాట్లాడతారని అన్నారు. “బిల్ గేట్స్ అందరినీ ఒకేలా చూసుకుంటాడు.. ఒకేలా అరుస్తాడు” అని ఆమె చెప్పింది. అతని గొప్ప పేరు రావడానికి మాత్రం ఆయనకు మార్కెట్లో ఉన్న సంబంధాలే కారణమని ఆమె చెప్పుకొచ్చారు.

మరో మాజీ ఉన్నత ఉద్యోగి మాత్రం ఇన్‌సైడర్‌తో 1988లో ఓరోజు ఉదయం బిల్‌గేట్స్ మరో మహిళపై వాలిపోయి కనిపించాడని, అప్పటికే మిలిందా గేట్స్‌తో బిల్‌గేట్స్ ప్రేమలో ఉన్నట్లు చెప్పారు. మరో ఉద్యోగి బిల్‌గేట్స్‌ ఉద్యోగులందరితో సమానంగా ఉండేవాడు కాదని, తనకు నచ్చని వాళ్లపై మాత్రమే, తనకు సహకరించనివారిపై మాత్రమే అరిచేవాడని ఆరోపించారు.

‘మే’లో మిలిందా గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న తరువాత, కొన్ని మీడియా నివేదికలు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన కార్యాలయంలో అనుచితంగా ప్రవర్తిస్తారంటూ.. దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో అతని సంబంధాన్ని హైలైట్ చేస్తూ కథనాలు రాశాయి. ముఖ్యంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో విడాకులకు ఇదే ముఖ్యమైన కారణం అంటూ రాసుకొచ్చింది. 2019నుంచే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు రాసుకొచ్చింది. అయితే ఎప్‌స్టీన్‌తో తాను ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే చర్చిస్తున్నట్లుగా బిల్‌గేట్స్‌ 2013లో వివరణ ఇచ్చారు.

ఇక బిలియనీర్ వ్యక్తిగత జీవితాన్ని గురించి వస్తున్న వార్తలను నియత్రించడానికి బిల్‌గేట్స్ బృందం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఇన్సైడర్స్ జర్నలిస్ట్‌లకు చెప్పారు.