Love In Old Age Home : వృద్ధాశ్రమంలో కలిసిన మనస్సులు..వరుడికి 75,వధువు వయస్సు 70ఏళ్లు..

ప్రేమలో పడటానికి వయస్సు ఉంటుందా? ఈ వయస్సులోనే ప్రేమలో పడాలని రూలుందా? అంటే లేనేలేదని ఎంతోమంది నిరూపించారు. ముదిమివయస్సులో వివాహాలు చేసుకుని పెళ్లికి వయస్సుకు..ప్రేమకు వయస్సుకు సంబంధంలేదని నిరూపించారు. ఓ వద్ధాశ్రమంలో ఉంటున్న 75 ఏళ్ల వ్యక్తి అదే ఆశ్రమంలో ఉంటున్న 70 ఏళ్ల మహిళలను వివాహం చేసుకున్నాడు. ముదిమివయస్సులో చిగురించిన ప్రేమ పెళ్లిపీటలెక్కింది.

Love In old age home.. Old couple married

Love In old age home.. Old couple married : ప్రేమలో పడటానికి వయస్సు ఉంటుందా? ఈ వయస్సులోనే ప్రేమలో పడాలని రూలుందా? అంటే లేనేలేదని ఎంతోమంది నిరూపించారు. ముదిమివయస్సులో వివాహాలు చేసుకుని పెళ్లికి వయస్సుకు..ప్రేమకు వయస్సుకు సంబంధంలేదని నిరూపించారు. ముదిమివయస్సులో చిగురించిన ప్రేమ ఈ సమాజానికి ఓ వార్త కావచ్చు. కానీ మాకు మాత్రం మా జీవితంలో అద్భుతమైన అనుభూతి అంటున్నారు ఓ వృద్ధ జంట..

వయస్సు మీరాక కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పించేస్తారు. అక్కడే వారి జీవితాలు వెళ్లదీస్తుంటారు. ఏదో నిరాశ, నిస్పృహలతో కాలం వెళ్లదీస్తుంటారు. అక్కడ ఉన్న తమతోటివారితో తమ బాధలు చెప్పుకుంటుంటారు. ఒకరినొకరు ఓదార్చుకుంటారు. కానీ వృద్ధాశ్రమంలో ఉన్న ఇద్దరు వృద్ధుల మధ్య ముదిమి వయస్సులో ప్రేమ చిగురించింది.మలిసంధ్యలో మరోసారి ప్రేమపారవశ్యంలో మునిగిపోయిన ఆ వృద్ధులు తోటి వృద్ధుల సమక్షంలో..వృద్ధాశ్రమం నిర్వాహకుల మధ్య ఒక్కటయ్యారు. ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లోని జానకి అనే వృద్దాశ్రమంలో ఉంటున్నారు వివంక్ వాడీ నివాసి అయిన 75 ఏళ్ల బాబూరావు పాటిల్, వాఘోలికి చెందిన 70 ఏళ్ల అనసూయ షిండే.వీరిద్దరు అదే ఆశ్రమంలో రెండేళ్లుగా ఉంటున్నారు. ఆ వృద్ధాశ్రమంలోనే వారికి పరిచయం ఏర్పడింది. ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలు కలవడంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ల ప్రేమ కాస్తా పెళ్లి పీటలెక్కింది. సంప్రదాయంగా పెళ్లి కూడా చేసుకున్నారు. బాబూరావు పాటిల్ భార్య చనిపోయింది. అలాగే అనసూయ భర్త కూడా చనిపోయారు. వీరిద్దరు ఈ వృద్ధాశ్రమంలోనే పరిచయం అయ్యింది. అలా వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. దీంతో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తరువాత ఇద్దరు వివాహం చేసుకున్నారు.

వృద్ధాశ్రమంలో ఉంటున్న తోటి వృద్ధులు ఈ వయస్సులో ప్రేమే ఏమిటి? పెళ్లేమిటి? విడ్డూరం కాకపోతే అంటూ బుగ్గుల నొక్కుకోలేదు. వారి ప్రేమను అభినందించారు. దగ్గరుండి వివాహం జరిపించి మనస్ఫూర్తిగా ఆశ్వీర్వదించారు. ఈ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న డ్రైవర్ బాబాసాహెబ్ పూజారి చట్టపరమైన చర్యలన్నింటినీ పూర్తి చేసి..వారిద్దిరి పెళ్లికి సాక్షిగా సంతకం కూడా చేశారు.

వృద్ధాశ్రమంలోని నిర్వహకులు అంతా కలిగి ఈ వృద్ధ జంటకు ఘనంగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ పెళ్లి ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లేటు వయసులో పెళ్లి చేసుకున్న వృద్దుడు, వృద్దురాలిని అందంగా కొత్త పెళ్లికూతురు, పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు.సంప్రదాయ పద్దతిలో పెళ్ల మండపం వేసి ..ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లిళ్లు స్వర్గాన నిర్ణయించబడతాయనే మాట ఎంత వాస్తవమో తెలియదు కానీ ..ఓల్డ్ ఏజ్ హోముల్లో కూడా ప్రేమ పుడుతుందని నిరూపించారీ జంట..