Military chopper crash landing Live updates: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. 13 మంది మృతి.. బిపిన్ రావత్ భార్య మృతి?

తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది.

Helicop

Military chopper: తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మొత్తం 14 మంది ఉన్నట్టు సమాచారం అందుతోంది. ప్రమాదంలో ఇప్పటివరకూ 13 మంది ప్రాణాలు పోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఆర్మీ సీడీఎస్ బిపిన్ రావత్ భార్య మధులిక కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

హెలికాప్టర్‌ కూలిన తర్వాత మంటలు చెలరేగగా.. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు. తమిళనాడులోని కూనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హెలికాఫ్టర్ పూర్తిగా కాలిపోయింది.

వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఆ ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్మెంట్‌కు తరలించారు. ఆర్మీ, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు.. బిపిన్ రావత్ ను ఆస్పత్రికి తరలించారని.. తీవ్ర గాయాలపాలై విషమ పరిస్థితిలో ఉన్న ఆయనకు చికిత్స అందుతోందని సమాచారం.