ఈశాన్య సరిహద్దుల్లో తరచూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాంతో అడుగులేస్తోంది. అసోంను రెండుగా విడదీస్తున్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగం తవ్వాలని కేంద్రప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది.దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్రం సంబంధిత అధికారులును ఆదేశించింది.
అసోంలోని తేజ్ పుర్ కి దగ్గర్లో నదీగర్భం కింద ఈ భారీ ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ నది వెడల్పు దాదాపు 12-15 కి.మీ వరకు ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రం. అయితే అత్యవసర పరిస్థితుల్లో అక్కడకు సాయుధదళాలు చేరుకునేందుకు బ్రహ్మపుత్ర నదిని దాటాల్సి ఉంటుంది. బ్రహ్మపుత్రలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో రెండు పెద్ద వంతెనలు నిర్మించారు. కానీ సొరంగ నిర్మాణం మరింతగా రక్షణగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిలటరీ కాన్వాయ్ లకు సొరంగంలో పూర్తి భద్రత ఉంటుందని అధికారులు తెలిపారు.
రుతుపవనాల సమయంలో బ్రహ్మపుత్ర నది ప్రవాహం భారీగా ఉంటుంది. నది అనేక సార్లు తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తుందని, అదే నదీ గర్భంలో సొరంగం తవ్వితే ఎలాంటి ఆటంకాలు లేకుండా సైనిక దళాలను తరలించవచ్చని అధికారులు తెలిపారు.దోలా-సదియా, బోగీబీల్… తదితర భారీ వంతెనలు ఉన్నప్పటికీ వాటిపై ఇతర వాహనాలు భారీ సంఖ్యలో తిరుగుతుంటాయి. సొరంగం నిర్మిస్తే శత్రుదేశాల దాడుల భయం లేకుండా ఇండియన్ ఆర్మీ చైనా సరిహద్దుల వరకు చేరుకునే అవకాశముంటుంది