ప్రముఖ సంగీన విద్యాంసుడు..శాస్త్రీయ గాయకుడు..పద్మవిభూషన్ పురస్కారం గ్రహీత అయిన పండిట్ జస్రాజ్ కు అరుదైన గౌరవం లభించింది. ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉప గ్రహాలు ఉన్నాయి. వాటిలో అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉండే ఓ గ్రహానికి 86 సంవత్సరాల బస్ రాజ్ పేరు పెట్టారు.
సైంటిస్టులు ఈ గ్రహాన్ని 2006లో కనుగొన్నారు. ఓ భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడి పేరును పెట్టడం ఇదే తొలిసారి కావటం విశేషం. ఖగోళశాస్త్రానికి సంబంధించిన అంతర్జాతీయ సమితి 23న ‘పండిత్ జస్రాజ్’ అని పేరు పెట్టారని ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ తెలిపారు. సెప్టెంబర్ 23 న అంతర్జాతీయ ఖగోళ యూనియన్(IAU) అధికారికంగా ప్రకటించింది. అనంతరం జస్రాజ్ కు ప్రశంసాపత్రాన్ని అందజేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇదంతా భగవంతుడి దయ అంటూ..ఆనందం వ్యక్తంచేశారు.