Pune Man Arrest
Bank Employee: దొంగ అనుకుని పొరబడిన సెక్యూరిటీ గార్డులు బ్యాంకు ఉద్యోగిని హతమార్చారు. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అనుమానించి చావబాదడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో బెంగళూరు పోలీసులు ఇద్దరు గార్డులను అరెస్ట్ చేశారు.
శ్యామనాథ్ రే, అజిత్ మురా అనే ఇద్దరు వ్యక్తులు ఆనంద్ నగర్ లోని హెచ్ఏఎల్ లో ఉంటున్నారు. అభినాశ్ పాఠి (27) అనే ఒడిశాకు చెందిన వ్యక్తి బెంగళూరులోని ప్రైవేట్ బ్యాంకు బ్రాంచిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
జులై 3న స్నేహితులతో కలిసి బయకు వెళ్లిన అభినాశ్ కు మరాతహల్లిలోని తన స్నేహితుడు ఇంటి అడ్రస్ తెలియడం కష్టమైంది. ఎట్టకేలకు జులై 4న అర్ధరాత్రి వంశీ సిటాడెల్ కు, సెక్యూరిటీ గార్డులకు తెలియకుండా గోడ దూకి లోపలికి వెళ్లాడు. అప్పుడే ఒక సెక్యూరిటీ గార్డు అయిన శ్యామనాథ్ ఆపి వివరాలు అడిగాడు.
Read Also : భార్య వేధింపులతో బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం
తన ఫ్రెండ్ ఉండే అపార్ట్‌మెంట్ ఇదేనని రుజువు చేయలేకపోయాడు. అలా అనుమానంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అభినాశ్ ను తీవ్ర గాయాలయ్యేంత వరకూ ఇనుపరాడ్ తో కొట్టారు. వాళ్లపై ఎదురుదాడి చేస్తున్న క్రమంలో అతణ్ని దారుణంగా బాదారు. అలా తలకు గాయాలు కాగా ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు.