Rishabh Singh Sambyal Resign: సోషల్ మీడియా సెన్సేషన్.. ఆర్మీకి ‘మేజర్ రిషభ్ సింగ’ రిజైన్.. రాష్ట్రపతి మాజీ ADC కీలక నిర్ణయం
నేషనల్ క్రష్ అని పిలుచుకునే ఆర్మీ ఆఫీసర్ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్(Rishabh Singh Sambyal Resign) సుమారు 12 ఏళ్ల మిలిటరీ సేవ తర్వాత సైన్యం నుంచి ముందస్తు విరమణ తీసుకున్నారు.
- V Santhosh Kumar
- Published on- August 31, 2026 / 02:20 PM IST
Mmajor rishabh singh sambyal president droupadi murmu former adc resigns from indian army
- మేజర్ రిషభ్ సింగ్ రాజీనామా
- ఆర్మీ సేవల నుంచి విరమణ
- రాష్ట్రపతి ముర్ముతో ఆఖరి భేటీ
Rishabh Singh Sambyal Resign: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక కార్యక్రమాలు, విదేశీ పర్యటనల్లో ఆమె వెంట నిలుస్తూ సోషల్ మీడియాలో విశేష ప్రజాదరణ పొందిన మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్(Rishabh Singh Sambyal Resign)వార్తల్లో నిలిచారు. నెటిజన్లు ‘నేషనల్ క్రష్’ అని పిలుచుకునే ఈ ఆర్మీ ఆఫీసర్, సుమారు 12 ఏళ్ల మిలిటరీ సేవ తర్వాత సైన్యం నుంచి ముందస్తు విరమణ (Premature Retirement) తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రీయ భవన్‌లో రాష్ట్రపతిని కలసి ఆశీస్సులు తీసుకున్న ఆయన, తన సర్వీస్ కాలంలో నేర్చుకున్న విషయాలు వ్యక్తిగతంగా ఎదగడానికి ఎంతో తోడ్పడ్డాయని తెలిపారు.
ఎన్‌డీఏ నుంచి రాష్ట్రపతి ఏడీసీ వరకు సాగిన ప్రయాణం
2013లో ఎన్‌డీఏ పరీక్ష ఉత్తీర్ణులైన రిషభ్, ఇండియన్ మిలటరీ అకాడమీలో రక్షణ రంగానికి చెందిన అధ్యయనం పూర్తి చేశారు. 2021 గణతంత్ర వేడుకల్లో ‘జాట్ రెజిమెంట్’ బృందానికి నేతృత్వం వహించి ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఆ తర్వాత పారా స్పెషల్ ఫోర్సెస్ (4 Para SF) లో సేవలు అందించి ‘బలిదాన్ బ్యాడ్జ్’ సాధించారు. మార్చి 2023లో రాష్ట్రపతి ఏడీసీ (Aide-de-Camp) గా ఎంపికై, అత్యున్నత ప్రోటోకాల్, భద్రత, విదేశీ దౌత్య పర్యటనల సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.
సోషల్ మీడియా ట్రెండింగ్ – విరమణకు కారణాలు
రాష్ట్రపతి వెంట బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన ప్రవర్తన, సైనిక శైలి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో విపరీతమైన గుర్తింపు లభించింది. అయితే, తన వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్ల మిలిటరీ సేవల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 12 ఏళ్ల నాయకత్వ, వ్యూహాత్మక అనుభవం ఉన్న రిషభ్ సంబ్యాల్ తన తదుపరి భవిష్యత్తు ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు.
