తన లవర్ కోసమే అమ్మే.. నాన్నను చంపేసింది

ఖరగ్‌పూర్‌లోని నింపురా రైల్వే కాలనీకి చెందిన ఎం.ఈశ్వరరావు (44) జులై 22న మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా.. సహజ మరణం గుండెపోటుగా భావించారు. జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులంతా తీవ్ర దుఖఃంలో మునిగిఉన్నారు. ఆ సమయంలో మృతుని కూతురు.. తన పెదనాన్న వెంకటరమణ దగ్గరకు వెళ్లి అది సహజ మరణం కాదని చెప్పింది.

ఇది హత్య అని తల్లి ప్లాన్ ప్రకారమే ప్రియుడితో కలిసి పాల్పడిందని వివరించింది. షాక్ గురైన వెంకటరమణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరదలిపై కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఈశ్వరరావు భార్యే హత్య చేసిందని తేలింది. ప్రియుడితో కలిసి భర్తకు శ్వాస ఆడకుండా చేసిందని నిర్థారణ చేసుకున్నారు.

నేరానికి పాల్పడిన ఈశ్వరరావు భార్యను, ఆమె లవర్‌ను పోలీసులులో అదుపులోకి తీసుకుని విచారించారు. అడ్డుగా ఉన్న ఈశ్వరరావును మట్టుబెట్టి అడ్డు తొలగించుకోవాలని జులై 21న ప్లాన్ చేశారు. రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కుమార్తె ఘటనను చూసి సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టామని నిజాలు వెల్లడయ్యాయని పోలీసులు అంటున్నారు.